TOLLYWOOD: టాలీవుడ్ ఎంట్రీపై ఆస‌క్తి.. అక్కా చెల్లెళ్ల‌లో ముందుగా ఎంట్రీ ఇచ్చే ముద్దుగుమ్మ ఎవ‌రు?

అతిలోక సుంద‌రి శ్రీదేవి సౌత్‌తో నార్త్‌లోను ఎంతగా ఉర్రూతలూగించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. శ్రీదేవి అంద‌చందాల‌కు ప్ర‌తి ఒక్కరు ముగ్దులు కాగా, ఆమె సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేసేవి. అయితే శ్రీదేవి అకాల మ‌ర‌ణం చెంద‌డంతో ఆమె ఫ్యాన్స్ చాలా డిప్రెష‌న్‌కు వెళ్లారు. అయితే అప్ప‌టికే శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ సినిమాల‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆమెలో అతిలోక‌సుంద‌రిని చూసుకొని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. జాన్వీ క‌పూర్ ప్ర‌స్తుతం నార్త్‌లో బిజీగా ఉండ‌గా, త్వ‌ర‌లో సౌత్‌లోను అల‌రించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే జాన్వీ క‌పూర్‌తో పాటు ఆమె సోద‌రి ఖుషీ క‌పూర్ కూడా ఆరంగేట్రం చేయ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, వీరిద్ద‌రిలో ఎవ‌రు ముందుగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కానున్నార‌నే ఆస‌క్తి పెరిగింది.

జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ స్టాటస్ ని అందుకుని ప్ర‌స్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఈలోగానే ఖుషీ కపూర్ న్యూయార్స్ వెళ్లి తన నటశిక్షణను పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇదే సమయంలో జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. జాన్వీ తొందర్లోనే మహేష్ సరసన టాలీవుడ్ లో అడుగు పెట్టబోతోందంటూ కథనాలు ఊపందుకున్నాయి. ఓ అగ్ర బ్యానర్ జాన్వీని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసేందుకు ఉవ్విళ్లూరుతోందని ప్రచారమవుతోంది.

మ‌రోవైపు ఖుషీ క‌పూర్‌ని కూడా నార్త‌తో పాటు సౌత్‌లోను ప‌రిచ‌యం చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం భారీగానే క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. తన కుమార్తెలను అన్ని భాషల్లోనూ పాపులర్ చేసేందుకు బోని చేయని ప్రయత్నం లేదు. ఇటీవల అతడు కోలీవుడ్ టాలీవుడ్ పైనా పూర్తి స్థాయిలో దృష్టి సారించి సినిమాలు నిర్మించడం వెనక మతలబు కూడా ఇందే ఉంద‌నే టాక్ వినిపిస్తుంది. అన్ని భాష‌ల‌లో కూతుర్లు ఇద్ద‌రిని స్టార్ హీరోయిన్స్ గా చేయాల‌నేది బోనీ క‌పూర్ కోరిక‌గా తెలుస్తుంది. మ‌రి ఇంత‌కు తెలుగు ప‌రిశ్ర‌మ‌ను ముందుగా జాన్వీ క‌పూర్ ప‌ల‌క‌రిస్తుందా లేదంటే ఖుషీ క‌పూర్ ప‌ల‌క‌రిస్తుందా అనేది చూడాలి.