Sri Reddy : నిన్ను వదలను జగన్.. శ్రీరెడ్డి అంత మాట అనేసిందేంటి..!
NQ Staff - March 26, 2023 / 01:06 PM IST

Sri Reddy : టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఆమె మొదటి నుంచి కాంట్రవర్సీలకు పెట్టింది పేరుగా నిలబడుతోంది. అయితే ఆమె కేవలం సినిమాలతోనే కాకుండా రాజకీయ పరమైన విషయాలతో కూడా హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఆమె వైసీపీ పార్టీకి మొదటి నుంచి మద్దతు దారుగా ఉంటున్న సంగతి తెలిసిందే.
అయితే రీసెంట్ గా ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఇందులో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ గెలుచు కుంది. ఎమ్మెల్యే కోటా కింద నిర్వహించిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి టీడీపీ సొంతం చేసుకుంది. వైసీపీ పార్టీ నుంచే టీడీపీకి క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇక టీడీపీకి ఓటు వేసిన నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ గుర్తించింది.
ఆ నలుగురిని..
అందులో ఉండవల్లి శ్రీదేవి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఉన్నారని తెలిపారు. అయితే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది. ఈ నలుగురు ఎమ్మెల్యేలను విష పురుగులతో పోల్చింది. అంతే విషపురుగులు విషమే చిమ్ముతాయని తెలిపింది.
మీ మీద ప్రేమతో, మీరేమీ ఇవ్వకపోయినా, కోట్లాదిమంది ప్రజలు మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారన్నా.. నేను కూడా మీ తోనే ఉంటాను. మిమ్మల్ని వదలం జగనన్నా అంటూ పోస్టు పెట్టింది. దాంతో ఈ పోస్టు కాస్తా వైరల్ అవుతోంది. ఎంతైనా కాకా పట్టడంతో శ్రీరెడ్డి తర్వాతే ఎవరైనా అని అంటున్నారు నెటిజన్లు.