ఐపీఎల్: సన్ రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్.. నేడే మూడో పోరు.

Advertisement

ఐపీఎల్ 2020 నేడు మూడవ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. అయితే రెండు జట్లు మంచి ఫామ్‌లో ఉన్నందున ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఐపీఎల్ చివరి నాలుగు సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్‌కు చేరుకున్నప్పటికీ, 2016 ఐపీఎల్ కప్ కొంచంలో మిస్ అయ్యింది. ఈ సారి ఎలాగగైనా కప్ కొట్టాలని సన్ రైజర్స్ భావిస్తోంది. ఇక బలమైన ప్లేయర్స్ ఉండడంతో సన్ రైజర్స్‌కు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎలాగు ఐపిఎల్-13లో మంచి ప్రదర్శనతో కప్ గెలుచుకునే అవకాశం లేకపోయింది.

ఇక మరోవైపు బెంగుళూర్ జట్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు. అలాగే ఆ జట్టులో భారీ హార్డ్ హిట్టర్లు, అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నప్పటికీ, వారు ఆశించినంత ఆడకపోవడంతో ఆర్సీబీకి నెగెటివ్ పాయింటనే చెప్పాలి. కానీ ఈ సారి తమ ఆటతీరును మెరుగుపర్చుకొని ఎలాగైనా కప్ గెలవాలనే పట్టుదలతో ఉంది బెంగుళూర్ జట్టు. ఇక ఒకవైపు హైదరాబాద్ జట్టుది తొలి మ్యాచ్ అవ్వడంతో సన్ రైజర్స్ జట్టు అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here