Sreemukhi : మీరు చూపిస్తే.. నేను దాచుకోవాలా.. శ్రీముఖి ఏంటీ మాటలు..!
NQ Staff - June 22, 2023 / 02:33 PM IST

Sreemukhi : శ్రీముఖి అంటే బుల్లితెరపై టాప్ యాంకర్. ఇప్పుడు ఆమెను కొట్టే వారే లేకుండా పోయారు. బిగ్ బాస్ తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోతోంది. అయితే బుల్లితెరపై కూడా అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు బాగా పెరిగిపోతున్నాయి. శ్రీముఖి కూడా ఏం తక్కువ కాదన్నట్టు రెచ్చిపోతోంది.
తాజాగా ఆమె ఓం కార్ హోస్ట్ గా చేస్తున్న సిక్త్స్ సెన్స్ ప్రోగ్రామ్ కు మోనాల్ తో కలిసి వచ్చింది. ఈ ఇద్దరూ వస్తూనే రచ్చ రచ్చ చేశారు. పైగా అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తూ ఎక్స్ పోజింగ్ చేశారు. రవితేజ నటించిన క్రాక్ సినిమాలోని చీమకుర్తిలో కన్ను తెరిచా అనే సాంగ్ కు చేసిన మూమెంట్స్ తో ఆడియెన్స్ మైండ్ ను బ్లాంక్ చేసేసారు.
అయితే ఈ షోలో శ్రీముఖి చేసిన చర్యలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి.. ఈమె పుష్ప సినిమాలో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా అనే డైలాగ్ ను మోనాల్ చుట్టూ తిరుగుతూ చివరిగా ఆమె బటక్స్ మీద కొట్టింది. దాంతో మోనాల్ షాక్ అయిపోయింది. ఆ తర్వాత ఓం కార్ ను చూస్తూ కొంటె కామెంట్లు చేసింది.
మీరు చూపిస్తారు.. మమ్మల్నేమో మొత్తం కవర్ చేసుకోమంటారు అంటూ సెటైర్లు వేసింది. దాంతో ఓం కార్ తన చాతి భాగంపై చేతులు అడ్డుగా పెట్టుకుంటాడు. దాంతో అంతా నవ్వులు పూశాయి. చూడాలి మరి ఎపిసోడ్ ఎంత దారుణంగా ఉంటుందో.