Sreeleela : ఆ ముగ్గురు హీరోయిన్లకు నిద్ర లేకుండా చేస్తున్న శ్రీలీల.. ఈ క్రేజ్ ఏంట్రా బాబు..!
NQ Staff - June 15, 2023 / 12:25 PM IST

Sreeleela : శ్రీలీల.. ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్న పేరు ఇది. చేసింది ఇప్పటి వరకు రెండు సినిమాలే. కానీ కుర్రాళ్లకు హాట్ ఫిగర్. ఆమె ఎక్స్ ప్రెషన్లకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె డ్యాన్స్ కు చూసిన వారు స్టెప్పులేస్తున్నారు. రెండు సినిమాల్లో ధమాకా మాత్రమే హిట్ అయింది. కానీ ఈ రెండు సినిమాల్లో ఆమెనే హైలెట్ అయింది.
దెబ్బకు ఆమె టాలీవుడ్ ను శాసించే స్థాయికి వెళ్లిపోయింది. ఎంతలా అంటే ఒకేసారి తొమ్మిది సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ, మహేశ్ బాబుతో గుంటూరు కారం, నవీన్ పొలిశెట్టితో `అనగనగా ఒక రాజు`, వైష్ణవ్ తేజ్ `ఆదికేశవ్ సినిమాలు చేస్తోంది.
దీంతో పాటు రామ్, బోయపాటి సినిమా, నితిన్ సినిమా, విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి సినిమాలు చేస్తుంది. నిన్ని బర్త్ డే సందర్భంగా ఆమె పాత్రలకు సంబంధించి ఈ సినిమా నుంచి పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి. ఇందులో డిఫరెంట్ లుక్స్ లో కనువిందు చేస్తుంది శ్రీలీల.

Sreeleela Will Act Nine Movies
ఇర బన్నీతో కూడా ఓటీటీ ఫిల్మ్ చేస్తోంది. ఇలా వరుసగా అందరు హీరోలు ఆమెనే కావాలని కోరుకుంటున్నారు. దాంతో మొన్నటి వరకు టాలీవుడ్ ను ఏలిన రష్మిక మందన్నా, పూజాహెగ్డే, కృతిశెట్టి, కీర్తి సురేష్ ల పేర్లు గల్లంతు అయ్యేలా ఉన్నాయి. శ్రీలీల దెబ్బకు వారికి నిద్ర కూడా కరువయ్యేలాగా కనిపిస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో సౌత్ ఇండస్ట్రీని తన గుప్పిట్లోకి తీసుకునేలా కనిపిస్తోంది ఈ భామ.