Sreeleela : తప్పించుకున్న పూజాహెగ్డే.. బలైపోయిన శ్రీలీల..!

NQ Staff - January 15, 2024 / 10:27 AM IST

Sreeleela : తప్పించుకున్న పూజాహెగ్డే.. బలైపోయిన శ్రీలీల..!

Sreeleela :

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో.. ఎంత అవుతుందో కూడా చెప్పలేరు. ఒక్కోసారి ముందు ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా చివరకు మంచి హిట్ అవుతుంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఒక్కోసారి వారు ఎంచుకున్న సినిమాలు వారిని నిండా ముంచేస్తాయి. అసలు హిట్ అవుతుందా అనుకున్న చిన్న సినిమా కూడా వారికి భారీ హిట్ ఇచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తుంది. దాంతో దెబ్బకు వారు రాత్రికి రాత్రే పెద్ద స్టార్ హీరోయిన్లు అయిపోతుంటారు. ఇప్పుడు పూజాహెగ్డే ను చూస్తే ఈ విషయం మీకు అర్థం అవుతుంది.

మొదట్లో సినిమా ఛాన్సులు రాక ఇబ్బందులు పడ్డ పూజాహెగ్డే ఆ తర్వాత గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. చేసిన ప్రతి సినిమా వరుసగా పెద్ద హిట్ అయిపోయింది. మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురంలో చాలా పెద్ద హిట్లు అయిపోయాయి. దాంతో ఆమెకు తిరుగులేకుండా పోయింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా వరుసగా హిట్ అయ్యాయి. ఇంకేముంది అనుకున్నారు. కానీ ఆమెకు 2022నుంచి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. చేసిన ప్రతి సినిమా ప్లాప్ అయింది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వరుస ప్లాప్ అయ్యాయి.

ఈ క్రమంలోనే ఆమెకు మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారంలో ఛాన్స్ వచ్చింది. మొదట ఆమెతో కొంత షూటింగ్ కూడా చేశారు. కానీ ఎందుకో మధ్యలో ఆమెను తప్పించారు. సెకండ్ హీరోయిన్ ను చేయడం వల్లే తప్పనుకుందని కామెంట్లు కూడా వినిపించాయి. కానీ ఆమెకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే తప్పుకుందని ఓ ఇంటర్వ్యూలో నిర్మాత తెలిపారు. ఇక సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం తీసుకున్న శ్రీలీలను ఏకంగా మొదటి హీరోయిన్ ను చేసేశారు. అయితే ఈ సినిమా వదులుకుని తప్పు చేసిందంటూ పూజాహెగ్డేను చాలా మంది తిట్టారు.

బంపర్ ఆఫర్ వదులుకుందని.. ఇది చేసి ఉంటే ఆమెకు మళ్లీ కెరీర్ ఉండేదని కొందరు కామెంట్లు చేశారు. ఇక శ్రీలీల లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఆమె స్టార్ హీరోయిన్ అయిపోతుందంటూ చాలా కామెంట్లు వినిపించాయి. కానీ అక్కడే మిస్టరీ జరిగింది. సినిమా విడుదలైన రోజు నుంచే అట్టర్ ప్లాప్ టాక్ ను సంపాదించుకుంది.

Sreeleela Received Hat Trick Of Flops with Guntur Kaaram Movie

Sreeleela Received Hat Trick Of Flops with Guntur Kaaram Movie

దాంతో పూజాహెగ్డే లక్కీ అంటూ ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా చేసి ఉంటే పూజా ఖాతాలో హ్యాట్రిక్ ప్లాప్ పడి ఉండేదని అంటున్నారు. శ్రీలీల బ్యాడ్ టైమ్.. సినిమా వచ్చిన ఆనందం ఒక్క రోజు కూడా ఉండకుండానే ప్లాప్ ను మూటగట్టుకుందంటూ కామెంట్లు పెడుతున్నారు. పాపం శ్రీలీల ఖాతాలో హ్యాట్రిక్ ప్లాప్ వచ్చి పడింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us