Sreeleela : మా ముఖాలు ఎవడూ చూడడు.. హీరోల కోసమే థియేటర్లకు వస్తారుః శ్రీలీల
NQ Staff - May 25, 2023 / 09:40 AM IST

Sreeleela : సినిమాలో హీరో, హీరోయిన్ల నడుమ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక సినిమా మొత్తం హీరో చుట్టు మాత్రమే తిరుగుతుంది. దాన్ని ఎవరూ కాదనరు. హీరోయిన్ అందులో ఒక పాత్ర మాత్రమే. కాగా హీరోల గురించి, వారి ప్రాధాన్యత, రెమ్యునరేషన్ల గురించి అప్పుడప్పుడు కొందరు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా శ్రీలీల కూడా ఇదే విషయం మీద మాట్లాడింది. ప్రస్తుంత ఇండస్ట్రీలో అమ్మడి జోరు మామూలుగా లేదు. ఇప్పుడు ఆమె శకం నడుస్తోంది. ఇప్పుడు ఐదారు సినిమాలతో చాలా బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ఇప్పటికీ ఆడియెన్స్ హీరోలను చూసే సినిమా థియేటర్లకు వస్తుంటారు. వారి కోసమే టికెట్లు కొంటారు. అంతే తప్ప హీరోయిన్ల కోసం కాదు. నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను. కాబట్టి సినిమా మొత్తం నేనే కనిపించాలని కోరుకోను. మంచి పాత్ర వస్తే చాలు అనుకుంటాను.
ప్రస్తుతానికి చాలా మంచి పాత్రలు వస్తున్నాయి అంటూ తెలిపింది శ్రీలీల. అయితే ధమాకా సినిమా అంత పెద్ద హిట్ కావడానికి కారణం శ్రీలీల అంటూ ప్రచారం జరిగింది. ఆమె డ్యాన్స్, అందం యూత్ ను థియేటర్లకు రప్పించాయంటూ కామెంట్లు వచ్చాయి. తాజా వ్యాఖ్యలతో ఆ రూమర్లకు ఆమె చెక్ పెట్టిందని అంటున్నారు నెటిజన్లు.