Sr NTR : కేసీఆర్ కోసం సీనియర్ ఎన్టీఆర్ ప్రచారం.. రేర్ పిక్ వైరల్..!
NQ Staff - March 29, 2023 / 11:02 AM IST

టీడీపీ 41వ వార్షికోత్సవ వేడుకలు ప్రస్తుతం ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ అభిమానులు, సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు అభిమానులు అనేక విషయాలను, ఫొటోలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ అరుదైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ఫొటోలో ఇద్దరు సీఎంలు ఉన్నారు. ఒకరు సీనియర్ ఎన్టీఆర్ అయితే.. ఇంకొకరు ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్. 1994 నవంబర్ 20న సిద్దిపేటలో నాటి టీడీపీ అభ్యర్థి కెసీఆర్ కోసం ఎన్నికల ప్రచారంలో నందమూరి తారకరామారావు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలో సీనియర్ ఎన్టీఆర్ స్టేజిపై మాట్లాడుతున్నారు.
ఆయన వెనకాల సీఎం కేసీఆర్ చేతులు కట్టుకుని నిలబడ్డారు. సీనియర్ ఎన్టీఆర్ చేసిన ఆ ప్రచారం కేసీఆర్ కు బాగానే కలిసి వచ్చింది. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు కేసీఆర్. కేసీఆర్ మొదటి నుంచి సీనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద అభిమాని. అందుకే ఆయన తనయుడు కేటీఆర్ కు సీనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారు.
#TeluguDesam @JaiTDP కి 41వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
ఫోటో:
20 నవంబర్ 1994, మా ఊరు సిద్దిపేటలో నాటి టీడీపీ అభ్యర్థి కెసీఆర్ గారి కోసం ఎన్నికల ప్రచారంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు. pic.twitter.com/LKQDmwXqSM
— Alekhya Nayakam (@alekhyanayakam) March 29, 2023