ప్రధానికి తగ్గనున్న ఎస్పీజీ భద్రత
Admin - August 3, 2020 / 12:24 PM IST

ఢిల్లీ: ప్రధానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోర్స్ భద్రత తగ్గనుందని కేంద్ర సచివాలయ శాఖ తెలిపింది. ఇప్పుడున్న వారిలో 50-60% కమాండోర్స్ తోనే భద్రత కల్పించనున్నారు. అలాగే రానున్న రోజుల్లో నాలుగు వేల మంది ఉన్న సిబ్బందిని క్రమంగా తగ్గించనున్నామని అధికారులు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీకి, వారి కుటుంబానికి ఉన్న భద్రతా సిబ్బందిని కూడా తొలగించనున్నారు.
ఇప్పటికే 200 మంది కమాండోలను వారి మాతృ శాఖలకు బదిలీ చేశారు. వీరిలో సీఆర్పీఎ్‌ఫకు చెందిన 86 మంది, బీఎ్‌సఎఫ్ 45, సీఐఎ్‌సఎఫ్ 23, ఎఎ్‌సబీ 24, ఐటీబీపీ17మంది.. ఆర్పీఎఫ్, రాజస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన మరికొందరు ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు, సోనియా కుటుంబ సభ్యులకు భద్రతా సిబ్బందిని తొలగించాలన్న నిర్ణయంపై కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.