Indian Cricketers: మ‌న క్రికెట‌ర్స్‌లో దాగి ఉన్న స్పెష‌ల్ టాలెంట్స్‌ ఏంటో తెలుసా?

Indian Cricketers: భార‌త క్రికెట‌ర్స్ మ‌న‌కు క్రికెట‌ర్స్‌గానే సుప‌ర‌చితం. కాని వార‌లో మ‌న‌కు తెలియని చాలా టాలెంట్స్ దాగి ఉన్నాయి. భార‌త మాజీ అల్‌రౌండ‌ర్ సురేష్ రైనా పాట‌లు బాగా పాడ‌తాడు. సురేశ్ రైనా ఇప్పటికే రెండు ఆల్బమ్స్ విడుదల చేశాడు. ‘తు మిలి సబ్ మిలా’, ‘బితియా రాణి’ అంటూ సురేష్ రైనా పాడిన పాట‌ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇత‌గాడు ధోని రిటైర్మెంట్ త‌ర్వాత వెంట‌నే తానే రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఐపీఎల్ ధోని ఆడ‌క‌పోతే తాను ఆడ‌న‌ని చెప్పేశాడు.

Indian Cricketers:
Indian Cricketers:

ఇక ఇన్నాళ్లు ఆటగాడిగా ఉన్న శిఖర్ దావ‌న్ ఇప్పుడు శ్రీలంక సిరీస్ కోసం కెప్టెన్ అవ‌తారం ఎత్త‌బోతున్నాడు. స్టేడియంలో బౌండ‌రీల మోత మోగించే శిఖ‌ర్ ధావ‌న్ మంచి డ్యాన్స‌ర్ కూడా. అంతేకాదు ప్రొఫెష‌న‌ల్ ప్లూట్ ప్లేయ‌ర్ కూడా. త‌న ఫ్లూట్ ప్లేయింగ్ టాలెంట్‌ను ప‌లుమార్లు సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

భార‌త టెస్ట్ స్పెష‌లిస్ట్ అజింక్యా ర‌హానే ప్ర‌స్తుతం టెస్ట్ జ‌ట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చిన్న‌త‌నం నుండి మెడిటేష‌న్ చేసే ర‌హానే క‌రాటే మీద ఇష్టంతో బ్లాక్ బెల్ట్ సాధించాడు.

భారత మాజీ సార‌థి ధోనికి పెయింటింగ్ ఎక్కువ ఇష్ట‌మ‌ట‌. రిటైర్మెంట్ త‌ర్వాత పెయింట‌ర్‌గా కెరీర్ మొద‌లు పెడ‌తానంటూ ఓ సారి ప్ర‌క‌టించాడు కూడా. సేంద్రీయ వ్య‌వ‌సాయం కూడా ధోనికి ఇష్టం. రాంచీలోని త‌న ఫామ్ హౌజ్‌లో వ్య‌వ‌సాయ ప‌నులను స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తుంటాడు.

ఇక వివాదాస్పద క్రికెట‌ర్ శ్రీశాంత్‌కి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్న‌త‌నం నుండి డ్యాన్స్ నేర్చుకున్న శ్రీశాంత్ ఝ‌ల‌క్ దిక్లాజా 7, ఏక్ ఖిలాడీ ఏక్ హ‌సీనా వంటి డ్యాన్స్ షోల‌లో కూడా త‌న ప్రావీణ్యం చూపించాడు. సినిమాల‌లోను న‌టించాడు శ్రీశాంత్.

భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్‌సింగ్ మంచి న‌టుడు. ‘పుట్ సర్దారన్ దే, మెహండీ షాగ్నా డీ’ అనే రెండు సినిమాల్లో బాలనటుడిగా నటించిన యువరాజ్ సింగ్ అప్పుడ‌ప్పుడు టెన్నిస్, రోలర్ స్కేటింగ్ చేస్తుంటాడు.

జ‌డేజా క‌త్తి తిప్ప‌డంలో ప్రావీణ్యుడు. గుర్ర‌పు స్వారీ అన్నా కూడా ఇష్టం. అనిల్ కుంబ్లే ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కూడా. ఇంజనీరింగ్ పూర్తి చేసిన కుంబ్లే, జట్టులో ఉన్నప్పటి నుంచి తన ఫోటోగ్రఫీ టాలెంట్‌ను చూపించేవాడు. ఫోటోగ్రఫీ హాబీని కొనసాగిస్తున్న కుంబ్లే, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.