Chicken: చికెన్ పీస్ ధ‌ర రూ. 73 ల‌క్ష‌లంట‌.. ఇంత ధ‌ర ఎందుకంటారు!

Chicken: ప్రపంచంలో ప్రతిఒక్కరు జీవించేది తినడం కోసం అనుకుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ అంటే ఇష్టపడేవారు. అందుకే ప్రపంచంలో ఏ బిజినెస్ పెట్టినా.. ఫెయిల్ అవుతుందేమో కానీ, ఫుడ్ బిజినెస్ పెడితే ఖచ్చితంగా క్లిక్ అవుతుందనే సర్వేలో రుజువైంది. అందులోనూ చికెన్ అంటే ప్రాణం ఇచ్చే వారు కూడా ఉంటారు. వీరి కోసమే బిర్యానీ నుండి మినీ చికెన్ సెంటర్స్ వరకు చికెన్ ని మెయిన్ ఐటెమ్ గా అమ్ముతుంటారు. అయితే చికెన్ తో తయారు చేసే ఎంతటి అద్భుతమైన పదార్థం అయినా 10 వేలకు మించి ఉండదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చికెన్ పీస్ మాత్రం ఏకంగా 73లక్షల రూపాయలు. ఏంటి ఈ కోడి ఏమైనా స్పెషల్ అనుకుంటున్నారు. కోడి స్పెషల్ కాదండి.. ఇక్కడ తయారు చేసిన చికెన్ షేప్ చాలా డిఫరెంట్. అంతకంటే ఎక్కువ స్పెషల్ కూడా.

Chicken

ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ ని ప్రత్యేకంగా ప్రిపెర్ చేసే కంపెనీ మెక్ డోనాల్డ్స్ సంస్థ. తమ చికెన్ నగ్గెట్స్ తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది. రీసెంట్ గా ఈ కంపెనీ తయారుచేసిన చికెన్ నగ్గెట్స్ ఏకంగా 99,997 డాలర్లుతో హైలెట్ అయ్యింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారం 73 లక్షలన్నమాట. అయితే ఈ చికెన్ పీస్ కు ఎందుకంత క్రేజ్ అనుకుంటున్నారు. అమాంగ్ అస్ అనే ఓ వీడియో గేమ్ లో ఓ క్యారెక్టర్ షేప్ లో ఆ చికెన్ ను డిజైన్ చేశారు. సాధారణంగా వీడియో గేమ్స్ అంటే ఇష్టపడేవారు ఈ గేమ్ ను లైక్ చేసేవారున్నారు. అందుకే ఆ క్యారెక్టర్ లో షేప్ లో తయారు చేసిన చికెన్ పీస్ ఒక్కసారిగా ఇంటర్ నెట్ దర్శనమివ్వగా, దాన్ని కొనుగోలు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో రెడీ అయ్యారు.

Chicken

మొత్తానికి ఆ చికెన్ ముక్కను ఉటాకు చెందిన పోలిజ్నా అనే వ్యక్తి రూ.72 లక్షలకు కొనుగోలు చేశాడు. లైఫ్ లో మనకు నచ్చిన వాటి కోసం ఒక్కోసారి ఎంతవరకైనా వెళ్తుంటాం. కానీ ఇలాంటి విషయాల్లో కూడా జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఏది ఏమైనా 73 లక్షలతో ఈ చికెన్ పీస్ రికార్డ్ అయ్యి వార్తల్లోకి ఎక్కిందంటే గ్రేటే మరి.