ఎస్పీ బాలసుబ్రమణ్యం తాజా హెల్త్ బులిటెన్ విడుదల

Advertisement

ప్రముఖ లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడి చెన్నై లోని ఎంజిఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఆరోగ్యంపై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ప్రస్తుతం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన వెంటిటేలర్‌, ఎక్మో సహాయంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

అలాగే ఆయన ఆరోగ్యం మెరుగు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఊపిరితిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఆయన ఆరోగ్యం పై వైద్యులు ఎల్లవేళలా పరివేక్షించి వివరాలు తెలుపుతున్నారు. అలాగే బాలు అభిమానులు, బంధువులు, సన్నిహితులు తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here