చరిత్ర సృష్టించిన నాసా

Advertisement

2020 సంవత్సరం ఇప్పుడున్న ప్రజలకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంది. ఎన్నో ప్రజలను ఇబ్బందులు పెట్టె సంఘటనలు జరుగుతున్నాయి. అలాగే కొన్ని మంచి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. 2020 లో జరిగిన మంచి సంఘటనల్లో అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికాకు చెందిన నాసా స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ ద్వారా అమెరికాకి చెందిన వ్యోమగాములు డగ్ హార్లీ బాబ్ బెంకెన్ అంతరిక్షం నుంచి క్షేమంగా భూమికి చేరుకోవడం ఒకటి. భారత కాలమనం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 12.18కి ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో డ్రాగన్ క్యాప్సుల్ సురక్షితంగా ల్యాండ్ అయింది. గత మే 30 న వీరితో కూడిన అంతరిక్ష నౌక ఆకాశంలోకి ఎగిరింది. సాధారణంగా కజకిస్తాన్ లోని ఎడారి ప్రాంతంలో ల్యాండింగ్ చేస్తారు. కానీ ఈసారి కాస్త భిన్నంగా వాటర్ ల్యాండింగ్ కు సిద్ధమయ్యారు. 45 సంవత్సరాల తరువాత నాసా తొలిసారిగా స్ప్లాష్ డౌన్ ను నిర్వహించింది. అది విజయవంతమైంది. 1975లో అపోలో-సూయోజ్ మిషన్ ద్వారా నాసా తొలిసారిగా స్ప్లాష్ డౌన్ నిర్వహించింది. ఆ తరువాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

దీనిపై అమెరికా అధినేత ట్రంప్ స్పందిస్తూ… ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా భూమి చేరడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, అపోలో కమాండ్ మాడ్యుల్ అమెరికాలో దిగిన 45ఏళ్ల తర్వాత ఇదే తొలి స్పాష్ డౌన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆనందం వ్యక్తం చేశారు. ‘అంతరిక్షయానం కూడా సాధారణ విమాన ప్రయాణంలాగా మారిపోయినప్పుడు భవిష్యత్ లో మానవాళి మనుగడకు భద్రత దొరికనట్లే’ అంటూ ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఓ ప్రైవేటు క్యాప్సుల్ ద్వారా తన వ్యొమగాములను భూమికి తీసుకుని రావడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here