నాన్న గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది : ఎస్పీ చరణ్

Advertisement

ప్రముఖ లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడిన ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. అయితే ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో ఆగస్టు 13 రాత్రి ఆయన ఆరోగ్యంమరింత క్షీణించింది. ఇక అప్పటి నుంచి కూడా ఆయన ఎక్మో సపోర్టుతో చికిత్స పొందుతున్నాడు. ఇక ఆ తరువాత నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతూ వస్తుంది. సెప్టెంబర్ 14వ తేదీన తన తండ్రి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం అరగంట వరకు కూర్చోగలుగుతున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు.

కొద్దిసేపటి క్రితం ఎస్పీ చరణ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తన తండ్రి బాలు ఈసీఎంఓ సపోర్టుతో ఉన్నారని ఫిజియోథెరపీ చికిత్సలో చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక తన తండ్రి త్వరగా కోలుకోవాలని నిరంతరం ప్రార్ధించిన ఆసుపత్రి డాక్టర్లకు ఆయన
సన్నిహితులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here