బాలు లేకపోతే ఎలా!
Admin - September 25, 2020 / 10:13 AM IST

ఆయన పాటలు వింటూ లోకాన్ని మరిచిపోయిన సందర్భాలు ఎన్నో.

ఇంట్లో మంచి మ్యూజిక్ సిస్టం లేదని కేవలం ఆయన పాటలు వినడానికి థియేటర్ కు వెళ్లిన సందర్భాలు ఎన్నో.

మనసులో ఉన్న బాధను పోగొట్టుకోవడానిని ఆయన పాటలు విన్న సందర్భాలు ఎన్నో.

ఆయన పాటలు వింటూ వచ్చి రాని డాన్స్ స్టెప్స్ వేస్తూ ఎంజాయ్ చేసిన సందర్భాలు ఎన్నో.

ఆయన వస్తున్నాడని తెలిసి ఆయన చూడటానికి వందల కిలోమీటర్స్ చేసిన ప్రయాణాలు ఎన్నో.

ఆయన ఉన్న స్టేడియంలో నేను కూడా ఉండటాన్ని అచీవ్ మెంట్ గా ఫీల్ అయిన సందర్భాలు ఎన్నో.

సంగీతమనేది మనసులోని భావాలకు నిదర్శనం. పాటలోని భావాలకు, మ్యూజిక్ పరికరాల నుండి వచ్చే శబ్దానికి, తన స్వరంతో, స్వరంలోని హావభావాలతో ప్రాణం పోసి, మనసులను కదిలించే సంగీతాన్ని మనకు పరిచయం చేసిన వాడే “బాల సుబ్రమణ్యం”. సింగర్ బాల సుభ్రమణ్యం పుట్టకపోయి ఉంటే మన జీవితాల్లో మధురమైన సంగీత జ్ఞాపకాలను కోల్పోయి ఉండేవాళ్ళం.
- సాంబమూర్తి, శకుంతలమ్మ అనే దంపతులకు 1946, జూన్ 4 న నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం జన్మించారు. బాల్యమునుండే బాలుకు పాటలు పాడటము ఒక హాబీగా ఉండేది. కానీ ఆయన ఎవ్వరి దగ్గర సంగీతాన్ని నేర్చుకోలేదు. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయముతో మద్రాసులో ఏఎంఐఈ కోర్సులో చేరాడు.
- 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించాడు. ఇప్పటికి ఆయన దాదాపు 40వేల పాటలను ఆయన పాడారు.
*తెలుగు,తమిళ్,మలయాళం,హిందీ, కన్నడ మొదలగు భాషల్లో పాటలు పాడారు.
*బాలు కేవలం పాటలు పాడటం మాత్రమే కాకుండా నిర్మాతగా, డబ్బింగ్ చెప్పడం వంటివి కూడా చేశారు.