ఎస్పీ బాలసుబ్రమణ్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు

Advertisement

ప్రముఖ లెజండరీ సింగర్ కరోనా బారిన పడి చెన్నైలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల తన ఆరోగ్యం విషమంగా ఉందని, అలాగే వెంటిలేటర్స్ పైన ఉన్నాడని తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులు నిన్న హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. అయితే దీనితో బాలు అభిమానులు అందరు కూడా ఆందోళన చెందారు. ఇది ఇలా ఉంటె తాజాగా బాలు ఆరోగ్యం పై మరో బులిటెన్ విడుదల చేసారు వైద్యులు. ఆయన క్షేమంగానే ఉన్నారని ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు.

అలాగే ఐసీయూలో వెంటిలేటర్ పై తనకు చికిత్స కొనసాగుతోందని అన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. ఒకవైపు బాలు ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు పరివేక్షణలో ఉంచామని ఎంజిఎం ఆసుపత్రి డాక్టర్ ఏడీ డాక్టర్ అనురాధ భాస్కరన్ తెలిపారు. అలాగే బాలసుబ్రమణ్యం కుమారుడు కూడా ట్విట్టర్ ద్వారా తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని వెల్లడించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here