కరోనాను జయించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం

Advertisement

ప్రముఖ లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడి చెన్నై లోని ఎంజిఎం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే బాలు ఆసుపత్రిలో చేరిన నుండి తన ఆరోగ్యం విషమంగా ఉంది అని హెల్త్ బులిటెన్ ద్వారా వైద్యులు వెల్లడించారు. అయితే తాజాగా వైద్యులు బాలు ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. అలాగే ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్దారించారు.

అలాగే విదేశీ వైద్య బృందం అందిస్తున్న సూచనల మేరకు ఎస్పీ బాలుకు చికిత్సలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక అత్యవసర వైద్య చికిత్సాలో భాగంగా వెంటిలేటర్, ఎక్మో పరికరంతో చికిత్స అందిస్తున్నట్టు వారు తేలిపారు. ప్రస్తుతం ఎక్మో పరికరం సాయంతో బాలుకు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఒకవైపు బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు చేసిన ప్రార్థనలు ఫలించాయనే చెప్పుకోవాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here