నా పేరు ముందు అవి వాడకండి: బాలు రాసిన లేఖ

Admin - September 26, 2020 / 07:54 AM IST

నా పేరు ముందు అవి వాడకండి: బాలు రాసిన లేఖ

సింగర్ గా ఎన్నో శిఖరాలను అధిరోహించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక ఆయన లేరన్న విషయం ఏ ఒక్కరు జీర్ణించుకోలేకపోతున్నారు. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గొప్ప పేరును సంపాదించాడు ఎస్పీబీ. ఇక ఆయన లేరని తెలియగానే తన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు అభిమానులు.

తాజాగా ఆయన స్వతాగా రాసిన ఓ లేఖ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఆ లేఖలో ఆయన ఓ కార్యక్రమం గురించి వివరణ ఇస్తూ.. కొన్ని చిన్న చిన్నఅభ్యర్థనలను మీరు మన్నించాలని కోరుతూ.. నా పేరు ముందు ‘డాక్టర్‌’, ‘పద్మభూషణ్‌, ‘గానగంధర్వ’ వంటి బిరుదులు వేయకండి.. అని కోరారు బాలు.. ప్రస్తుతం ఈ లేఖ సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us