బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

Admin - September 25, 2020 / 09:27 AM IST

బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

ప్రముఖ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చెన్నై ఎంజిఎం ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అయితే గాయకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు బాలు. అయితే సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ప్రస్థానం ప్రారంభించినా, ఆ తరువాత గాయకుడిగా ఎన్నో పాటలను పాడారు. ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆయన పాడిన పాటలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా ఇలా బాలు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పాలి.

SP Balasubrahmanyam

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్‌ 4వ తేదీన మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. అయితే బాలు తండ్రి కళాకారుడు. ఆయన భక్తిరస నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు. ఇక అలా బాలుకి చిన్నతనం నుండే సంగీతం మీద ఆసక్తి ఉండేది. ఇక బాలుకు తన తండ్రే మొదటి గురువు అయ్యారు. తన ఐదేళ్ల వయసులో ‘భక్తరామదాసు’ నాటకంలో తండ్రితో కలిసి నటన ప్రదర్శించాడు. ఇక బాలు ప్రాథమిక విద్యను నగరిలో మేనమామ శ్రీనివాసరావు ఇంట పూర్తి చేసాడు. స్కూలు ఫైనల్‌ విద్యను శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో పూర్తి చేసాడు. ఇక ఆ సమయంలో ఒక్క చదువులోనే కాకుండా, ఆటల్లో కూడా బాలు మంచి ప్రతిభను కనబరిచే వాడు.

ఆ తరువాత పీయూసీ కాలేజీలో తన కళాశాల విద్యను పూర్తి చేసాడు. ఇక ఆ తరువాత నెల్లూరులో బాలు ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని తయారు చేశారు. అలాగే తన స్నేహితులతో కలిసి ప్రోగ్రాములు ఇచ్చేవారు. తరువాత అనంతపురంలో ఇంజనీరింగ్‌ సీటు రావడంతో అక్కడ చేరి వాతావరణం నచ్చకపోవడంతో మళ్లీ నెల్లూరు వచ్చేశారు. ఇక మద్రాసు వెళ్లి ఇంజనీరింగ్‌ విద్యకు సమానమైన ఎ.ఎం.ఐ.ఇ.లో చేరారు. ఇక అక్కడ చదువుకుంటూనే సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నాలు చేశారు.

ఇంజనీరింగ్‌ చేస్తున్న క్రమంలో రెండవ సంవత్సరంలో బాలుకి సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. ‘మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌’ అనే సినిమాలో ‘హ్యాపీ బర్త్‌ డే టు యూ’ అనే పాటను తొలిసారి బాలు వెండితెరమీద పాడారు. ఇక ఆ తరువాత ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తనలోని నటనకు పదును పెట్టారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. అలా మొదలైన బాలు పాట ప్రస్థానం వందల న నుండి వేలు దాటింది. అనేక భాషల్లో ఆయన 40వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సొంతం చేసుకున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us