పబ్ జి తో భారత్ లో అడుగు పెడతాం : సౌత్ కొరియా కంపెనీ

Advertisement

భారత్, చైనా సరిహద్దుల్లో జరిగిన సంఘటన కారణంగా కేంద్ర సర్కార్ చైనాకు సంబందించిన పలు మొబైల్ యాప్స్, ఎలక్ట్రానిక్ కంపెనీలను ఇండియాలో నిషేదించింది. భారత్ నిషేదించిన వాటిలో టిక్ టాక్ వంటి యాప్స్ ను భారత్ లో ఎక్కువగా ఉపయోగించేవారు. అలాగే మొన్నటికి మొన్న పబ్ జి తో సహా 118 యాప్స్ ను నిషేదించిన విషయం తెలిసిందే. అయితే భారత్ లో పబ్ జి గేమింగ్ ను అత్యధికంగా వాడే వారు. ఇక సర్కార్ నిషేధించడంతో చాలా మంది యువకులు నిరుత్సాహంలో ఉన్నారు.

ఇది ఇలా ఉంటె తాజాగా ఆ గేమ్ తయారు చేసిన సౌత్ కొరియా కంపెనీ స్పందించింది. భారత్‌లో తిరిగి అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలిపింది. తాము జరిగిన పరిస్థితులను అన్నింటిని గమనిస్తున్నామని, త్వరలోనే భారత్‌లో మా గేమ్ అడుగు పెడుతుందని ధీమాగా తెలిపింది. అయితే చైనా మూలాలు ఉండవు కాబట్టి త్వరలో ఈ గేమింగ్ యాప్‌పై నిషేధం తొలగిపోతుందని ధీమా వ్యక్తం చేసింది. అలాగే రాబోయే రోజుల్లో పబ్ జి కి చెందిన పూర్తీ బాధ్యతలు తామే తీసుకుంటామని వెల్లడించింది. దీనితో పబ్ జి ప్రేమికులకు కాస్త ఊరట కలగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here