South India Actors : ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న సౌత్ స్టార్లు వీరే..!
NQ Staff - June 5, 2023 / 10:54 AM IST

South India Actors : మొన్నటి వరకు మన సౌత్ సినిమాలకు నార్త్ లో పెద్దగా ఆదరణ ఉండేది కాదు. కానీ రాజమౌళి పుణ్యామా అని ఇప్పుడు మన సౌత్ సినిమాలు బాలీవుడ్ సినిమాలను మించి ఆడుతున్నాయి. వాటికంటే ఎక్కువ వసూళ్లు రాబడుతున్నాయి. దాంతో మన సౌత్ నుంచే పాన్ ఇండియా స్టార్లు పుట్టుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే వారి సినిమాలకు కూడా భారీగా మార్కెట్ జరుగుతోంది. దాంతో వారు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం ఇద్దరి గురించే.
ప్రభాస్..
మన డార్లింగ్ క్రేజ్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో చెప్పక్కర్లేదు. ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు కూడా పోటీ పడుతున్నారు. పైగా చేస్తున్నవన్నీ బడా ప్రాజెక్టులే. ఆయన ఆదిపురుష్ సినిమా కోసం ఏకంగా రూ.130 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అలాగే సలార్ కోసం రూ.120 కోట్లు తీసుకున్నారు. ఇక ప్రాజెక్ట్ కే సినిమా కోసం ఏకంగా రూ.150 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
రజినీకాంత్..
సూపర్ స్టార్ రజినీకాంత్ కు అన్ని భాషల్లో అభిమానులున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్న ఏకైక ఇండియన్ హీరో కూడా ఆయనే. అయితే తాజాగా ఆయన నటిస్తున్న జైలర్ సినిమా కోసం ఏకంగా రూ.130 కోట్లు తీసుకుంటున్నారంట. ఈ సినిమాను నెల్సన్ దర్శకత్వంలో తీస్తున్నారు.
కమల్ హాసన్..
విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ రేంజ్ కూడా భారీగానే పెరిగిపోయింది. ఆయన కూడా తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారు. తాజాగా ఆయన శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు భారీగా తీసుకుంటున్నారంట.
ఈ సినిమాకు రూ.125 కోట్లు తీసుకుంటున్నారని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇక అల్లు అర్జున్ పుష్ప-2 కోసం ఏకంగా రూ.100 కోట్లు తీసుకుంటున్నారు. రామ్ చరణ్ రూ.85 కోట్లు, ఎన్టీఆర్ రూ.80 కోట్ల దాకా తీసుకుంటున్నారు.