Sourav Ganguly : బెంగాల్ టైగ‌ర్‌కి మ‌రో కీల‌క ప‌ద‌వి.. సంతోషం వ్య‌క్తం చేస్తున్న ఫ్యాన్స్

Sourav Ganguly : బెంగాల్ టైగ‌ర్ సౌర‌వ్ గంగూలీ చ‌క్రం తిప్పుతున్నాడు. ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గంగూలీ.. ఇప్పుడు ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమించినట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది.

TheNewsQube-
Sourav Ganguly get icc big post
Sourav Ganguly get icc big post

అంతకు ముందు ఈ పదవిలో గంగూలీ సహచరుడు, ఇండియా మాజీ అనిల్ కుంబ్లే ఉన్నాడు. “అనిల్ కుంబ్లే తొమ్మిద సంవత్సరాల పాటు కొనసాగాడు. అతడి స్థానంలో బీసీసీఐ ఛైర్మన్ సౌరవ్ గంగూలీని నియమించారు. ఈ పదవి పదవీ కాలం మూడు సంవత్సరాలు కాగా కుంబ్లే మూడు పర్యాయాలు పని చేశారు.

Sourav Ganguly get icc big post
Sourav Ganguly get icc big post

గంగూలీ భారతదేశం అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా, అతని తరంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా ఉన్నాడు. గంగూలీ 2015, 2019 మధ్య బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశాడు. 2019 అక్టోబర్‌లో బీసీసీఐఅధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.

ఈ నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే మాట్లాడుతూ.. ‘ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ గా గంగూలీ బాధ్యతలు చేపట్టడాన్ని ఆహ్వానిస్తున్నాం. అంతర్జాతీయ మేటి క్రికెటర్లలో ఒకడైన గంగూలీ సేవలను మేం ఉపయోగించుకుంటాం. ఆటగాడిగానే గాక అడ్మినిస్ట్రేటర్ గా బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా మాకు కలిసొస్తుంది..’ అని తెలిపాడు.

ఈ పదవి నుంచి దిగిపోతున్న కుంబ్లే పై గ్రెగ్ ప్రశంసలు కురిపించాడు. ‘అనిల్ ఇన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలను పెంచడానికి కృషి చేశాడు. ఈ పదవిలో అతడు చేసిన సేవలు మరువలేనివి. డీఆర్ఎస్ విధానం సక్రమంగా అమలయ్యేలా చూడటం.. అనుమానాస్పద బౌలింగ్ శైలిలపై నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాలపై కుంబ్లే కీలకంగా వ్యవహరించాడు..’ అని ఆయన పేర్కొన్నాడు.

ఇదిలాఉండగా.. అఫ్గానిస్థాన్ లో క్రికెట్ స్థితిని సమీక్షించడానికి ఐసీసీ బుధవారం ఒక వర్కింగ్ గ్రూప్ ను నియమించింది. ఈ వర్కింగ్ గ్రూప్ ఇమ్రాన్ ఖవాజా (చైర్మన్), రాస్ మెక్కల్లమ్, లాసన్ నయిడో, రమీజ్ రాజా సభ్యులుగా ఉన్నారు. రాబోయే కొద్దిరోజుల్లో ఈ కమిటీ అఫ్గాన్ లో క్రికెట్ పరిస్థితులు, ఇతర విషయాల మీద సమగ్ర రిపోర్డును దాఖలు చేయనుంది.

ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గంగూలీ.. ఇప్పుడు ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో ఇక తర్వాత గంగూలీ చూపు ఐసీసీ అధ్యక్ష పదవిపైనే అని వాదనలు వినిపిస్తున్నాయి.