త్వరలో రోడ్లెక్కనున్న సిటీ బస్సులు

Advertisement

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో హైదరాబాద్ మహా నగరంలో ‌కొన్ని నెలలుగా సిటీ బస్సుల సేవలు నిలిచిపోయాయి. అయితే తాజాగా నగర వాసులకు ఓ శుభవార్త బయటకు వినిపిస్తుంది. అయితే సిటీ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయి. ఇక సిటీ బస్సు సర్వీసుల పై గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అయితే ఇటీవల మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక రాష్ట్రాల్లో టీఎస్‌ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేశారు.

ఇక మొదట 50 శాతం బస్సులు అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో టీఎస్ఆర్టీసీ ఉంది. ముఖ్యంగా ప్రయాణికుల తీవ్రత ఎక్కువగా ఉండే ఏడు ప్రధాన మార్గాల్లో సిటీ బస్సు సర్వీస్ ‌లు ప్రారంభించే అవకాశం ఉంది. ఇక ఈ విషయం పై సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే, ఈ నెల చివర వరకు సిటీ బస్సులు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం బయటకు వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here