సోను భాయ్ కె పన్నులు కట్టేద్దాం అభిమాని కామెంట్ కి సోను సూద్ రిప్లయ్
Admin - July 27, 2020 / 09:54 AM IST

కరోనా లాక్ డౌన్ విధించిన క్రమంలో వలస కూలీలకు వాహనాలు ఏర్పాటు చేసి సొంత ప్రాంతాలకు పంపించాడు సోను సూద్. అలాగే ఎంతో మంది ఆకలి తీర్చి గొప్ప మనుసును చాటుకున్నాడు. అలాగే విదేశంలో చిక్కుకుపోయిన కొంతమంది భారతీయ విద్యార్థులను తన సొంత ఖర్చుతో స్వదేశానికి రప్పించాడు.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సహాయాలు చేసాడు.
ఇది ఇలా ఉంటె తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన నాగేశ్వరరావు అనే రైతు, అతని భార్యాబిడ్డలు పడుతున్న కష్టం చూసి చలించిన సోనూ ట్రాక్టర్ అందించి వారికి అండగా నిలిచాడు. హామీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే సోనూ సూద్ సాయం చేయడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఈ సోనూ సూద్ రీల్ హీరో మాత్రమే కాదని, రియల్ హీరో అని అతని గొప్ప మనసుపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇంత మందికి, ఇన్ని రకాల సేవలు చేస్తూ ఆదుకుంటున్న సోనూ భాయ్‌కే మనమంతా పన్నులు చెల్లిస్తే బాగుంటుంది కదా! అని ఒక అభిమాని ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేసాడు. దీనికి సోను సూద్ నవ్వుతూ సరదాగా రిప్లయ్ ఇచ్చాడు.