Sonu Sood: తన ఫోటో తో కూడిన విమానంలో ప్ర‌యాణించిన సోనూ.. గ‌ర్వంగా ఉంద‌న్న రియ‌ల్ హీరో

Sonu Sood: సోనూసూద్.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. విల‌న్‌గా వెండితెర‌పై అల‌రించిన సోనూసూద్ రియ‌ల్ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. క‌రోనా వ‌ల‌న ఏర్ప‌డ్డ లాక్‌డౌన్ స‌మ‌యంలో సోనూసూద్ చాలా మందికి త‌న వంతు సాయాలు చేశారు. స్వస్థలాలకు వెళ్లలేక వలస కార్మికులు పడుతున్న కష్టాలను చూసి సొంత డబ్బులతో వారిని సొంత ఊళ్లకు పంపించారు.

sonu sood pic wth aircraft1
sonu sood pic wth aircraft1

బస్సులు, రైళ్లు, విమానాల్లో ఇళ్లకు పంపించి మానవత్వం చాటుకున్నారు. ఆ తర్వాత కూడా ఎంతో మంది పేదలు, రైతులు, విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో సోనూసూద్‌కి స్పైస్‌జెట్‌ నుంచి లభించిన గౌరవం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నవారికి తాను ఎప్పటికీ సాయం చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆయన చేసిన విశేషమైన సేవలకు గౌరవంగా స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ ఫొటో వేశారు.

ఆపద్బాంధవుడు సోనూసూద్‌కు సెల్యూట్‌ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి.లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది వలస కార్మికులను తమ స్వగ్రామాలకు పంపించేందుకు సోనూ ప్రత్యేకంగా స్పైస్‌జెట్‌తో కలిసి 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు.

sonu sood pic wth aircraft2
sonu sood pic wth aircraft2

అంతేకాకుండా విదేశాల్లో చిక్కుకున్న 1500 మంది భారతీయ విద్యార్థులను స్వదేశం తీసుకొచ్చారు. దీనికి సంబంధించి స్పైస్ జెట్ ఓ వీడియోను కూడా ట్విటర్ లో పోస్టో చేసింది. ఇలా ఎన్నో విధాలుగా సోనూ చేసిన సేవల పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ట్విటర్ లో ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే సోనూసూద్ తొలిసారి తన ఫోటో తో కూడిన విమానంలో ప్ర‌యాణించాడు. ఈ క్ర‌మంలో సంతోషం వ్యక్తం చేశాడు. సాధారణ రైలు టికెట్ తో ముంబై కి వచ్చి ఇప్పుడు విమానం పై తన ఫోటో ఉందంటూ ఎమోషనల్..అలానే త‌న అభిమానుల‌తో పాటు ఎయిర్ పోర్ట్ సిబ్బందితో కూడా ఫొటోలు దిగాడు సోనూ.