పేదల కోసం 10కోట్ల ఆస్థి తాకట్టు
Admin - December 9, 2020 / 04:51 PM IST

కరోనా కష్టకాలంలో ఎంతోమందికి అండగా నిలిచి సహాయసహకారాలు అందించాడు రియల్ హీరో సోనూసూద్. ముఖ్యంగా వలసకూలీలు దిక్కులేని స్థితిలో పిల్లజల్లా కలసి రోడ్ల పై వెళ్తుంటే వారి కడుపునింపి ఆకలిని తీర్చాడు. అంతేకాదు వారికీ ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసి వారి గమ్యస్థానాలకు చేర్పించాడు. ఇక లాక్ డౌన్ ముగిసిన కూడా ఆయన సాయం చేయడం మాత్రం ఆపలేదు. ఎవ్వరికీ ఆపద వచ్చిన, ఆర్థిక సాయం కావలసిన ట్విట్టర్ ద్వారా ఒక్క ట్వీట్ చేస్తే చాలు క్షణాల్లో ఆ కష్టాలను తీర్చాడానికి ముందుకు వచ్చాడు సోనూసూద్. ఇలా చెప్పుకుంటూపోతే ఆయన చేసిన సహాయసహకారాలు ఎన్నో ఉన్నాయి.
ఇదే క్రమంలో సహాయసహకారాలు అందజేయడానికి తన ఆస్తులను తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధం అయ్యాడు. అయితే ముంబైలోని జుహూలోగల 10 కోట్లు విలువచేసే ఆరు ప్లాట్లు, రెండు దుకాణాలు తాకట్టు పెట్టాడని సమాచారం వస్తుంది. ఇక సెప్టెంబర్ 15న అగ్రిమెంట్ల పై సంతకాలు కూడా చేసారని తెలుస్తుంది. అయితే ఈ తాకట్టు పెట్టిన ఆస్తులన్నీ తన భార్య సోనాలి పేరు మీద ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడానికి తన ఆస్తులన్నీ తాకట్టు పెడుతున్న సోనూసూద్ కు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం సోనూ తెలుగులో అల్లుడు అదుర్స్ చిత్రంలో నటిస్తున్నాడు.