‘ ఈస్ట్రన్ ఐ ‘ జాబితాలో నెంబర్ వన్ గా నిలిచిన సోనూసూద్
Admin - December 10, 2020 / 03:43 PM IST

బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు అరుదైన గౌరవం దక్కింది. అయితే కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సేవలు ఇంతాఅంత కాదు. ఇప్పటికే ఆయనను పలువురు పెద్ద ఎత్తున ప్రశంసించారు. ఇదిలా ఉంటె సోనూసూద్ కు మరో అత్యుత్తమ గౌరవం లభించింది. అయితే సోనూ సేవలు గుర్తించి బ్రిటన్ కు చెందిన మ్యాగజైన్ ఈస్టర్న్ ఐ చేసిన సర్వే లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే టాప్- 50 ఏషియన్ సెలబ్రిటీల్లో గ్లోబల్ 2020 జాబితాను ఈస్టర్న్ ఐ విడుదల చేసింది. ఇక యాభై మంది సెలబ్రెటీల్లో సోనూసూద్ అగ్ర స్థానంలో నిలిచాడు.
కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు సాయం చేసిన నటినటుల లిస్ట్ పరిశీలించగా అందులో సోను మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక తాను మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడంతో సోనూసూద్ హర్షం వ్యక్తం చేసాడు. ‘ నా సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని ఇచ్చిన ఈస్టర్న్ ఐ కి ధన్యవాదాలు. ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజలకు నా వంతు సాయాన్ని అందిస్తా.. ఒక భారతీయుడిగా సాయం చేయడం నా కర్తవ్యం. అలాగే నా తుది శ్వాస వరకు పేదలకు సాయం అందిస్తా ‘ అని సోనూసూద్ సంతోషాన్ని వ్యక్తం చేసాడు.
ఈస్టర్న్ ఐ మ్యాగజైన్ లో టాప్ 10 లో ఉన్న వారు వీరే..
1.సోనూసూద్
2.లిల్లీ సింగ్
3.ఛార్లీ XCX
4.దేవ్ పటేల్
5.అర్మాన్ మాలిక్
6.ప్రియాంకా చోప్రా
7.ప్రభాస్
8.మిండే కలింగ్
9.సురభి చాంద్నా
10.కుమెయిల్ నాంజ్యానీ