విద్యార్థి కోసం సెల్ టవర్ : మరోసారి గొప్ప మనసును చాటుకున్న సోనూసూద్
Admin - October 5, 2020 / 11:18 AM IST

‘సోనూసూద్’ ఎక్కడ ఆపద ఉన్న అక్కడ నేను ఉన్న అంటున్న రియల్ హీరో. ఎంతో మంది అభాగ్యుల ఆకలి తీర్చి వారికీ అండగా ఉన్న అని అంటున్నాడు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఎంతో ఆపన్న హస్తం అయ్యి వారి అవసరాలను తీర్చాడు. ఇక లాక్ డౌన్ ముగిసిన తన సేవలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికి సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి అండగా నిలుస్తూ వారికి ధైర్యాన్ని నింపుతున్నాడు. ఇక మొన్నటికి మొన్న ఒక బాలుడి ఆపరేషన్ కోసం ఇరువై లక్షల సాయం చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా మరొకరికి సాయం చేసాడు సోను.
అయితే హర్యానా రాష్ట్రంలోని మొర్ని గ్రామంలో ఒక చిన్న విద్యార్థి ఆన్ లైన్ క్లాసుల కోసం మొబైల్ ఉపయోగించాల్సి వచ్చింది. అయితే ఆ గ్రామంలో మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో ఆ అబ్బాయి చెట్టు పైకి ఎక్కి ఆన్ లైన్ క్లాసులు వింటున్నాడు. ఇక ఈ విషయాన్ని తెల్సుకున్న సోనూ.. ఆ గ్రామా పెద్దలతో మాట్లాడి టవర్ వేసేలా చర్యలు తీసుకున్నాడు. ఇక ఆ గ్రామా పెద్దలు టవర్ ను ఏర్పాటు చేసి ఫోటో తో సోనూసూద్ కు తెలిపారు.