తెలుగు రాష్ట్ర విద్యార్థులకు నటుడు సోనూసుద్ సహాయం

Advertisement

ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సమయంలో వలస కార్మికులు వాళ్ళ గమ్య స్థలాలకు చేరుకోవడానికి తిప్పలు పడుతున్న పరిస్థితుల్లో దేవుడిలా వాళ్లకు సాయం చేసాడు నటుడు సోనూసుద్. ముఖ్యంగా కార్మికులకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి మరి వారిని పంపించాడు. కొంతమంది కార్మికులకు భోజన వసతి కూడా కలిపించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందిని ఆదుకున్నాడు సోనూసుద్. ఇది ఇలా ఉంటె తాజాగా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది విద్యార్థులకు కూడా సహాయం చేసాడు. లాక్‌డౌన్‌తో కిర్గిస్తాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చి మరోసారి అందరి ప్రసంశలు అందుకున్నాడు. కిర్గిస్తాన్‌ రాజధాని బిష్‌కేక్‌లోని మెడికల్‌ కాలేజీల్లో చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కరోనా ఎఫెక్ట్‌తో అక్కడే చిక్కుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందేభారత్‌ మిషన్‌లో భాగంగా ప్రత్యేక విమానాల ద్వారా వందల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. కొన్ని కారణాలతో మరికొంత మంది తెలుగు విద్యార్థులు అక్కడే చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నసోనూసూద్ అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక విమానం ద్వారా విద్యార్థులను భారత్ కు రప్పించి వాళ్ళ సొంత ఊర్లకు చేర్చాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here