SONU SOOD: నిరంతరంగా కొన‌సాగుతున్న సేవా కార్య‌క్ర‌మాలు.. సోనూసూద్‌కు అంత డ‌బ్బెక్క‌డిది?

సోనూసూద్.. ఒక‌ప్పుడు ఈ పేరు వింటే అంద‌రు భ‌య‌ప‌డిపోయేవారు. వెండితెర‌పై విల‌నిజం ప్ర‌ద‌ర్శిస్తూ ప‌ర్‌ఫెక్ట్ యాక్ట‌ర్‌గా ఒదిగిపోయాడు. అరుంధ‌తి సినిమాలో సోనూసూద్ ప‌ర్‌ఫార్మెన్స్ చూసి పొగ‌డ‌ని వారు లేరు. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి వచ్చిన‌ప్ప‌టి నుండి సోనూసూద్ ప్ర‌జ‌ల‌కు న‌టుడిగా కాకుండా దేవుడిగా మారాడు. ఆయ‌న‌కు గుడులు క‌ట్ట‌డం, పూజ‌లు చేయ‌డం వంటివి చేస్తున్నారు. ఇప్పుడు ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా కూడా ప్ర‌భుత్వాల‌ని అడ‌గ‌కుండా సోనూసూద్ సాయాన్ని కోరుతున్నారు. ఇప్పటికీ క్షణం తీరిక లేకుండా ప్రజాసేవలోనే ఉంటూ అంద‌రి బాధ‌ల‌ను వింటున్నారు.

క‌రోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ దొర‌క్క చాలా మంది మృత్యువాత ప‌డ‌గా, ఏకంగా ఆక్సిజన్ ప్లాంటులే ఏర్పాటు చేస్తున్నాడు. అవ‌స‌ర‌మైన వారికి ఉచితంగా అందిస్తున్నాడు. అయితే ఇంత‌మందికి సోనూసూద్ సాయం ఎలా చేయ‌గ‌లుగుతున్నాడు అని అంద‌రిలో ఓ అనుమానం ఉంది. దీనిపై తాజాగా ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు సోనూ. గ‌త ఏడాది నుండి నేను చేసిన సేవా కార్య‌క్ర‌మాలు చూసి చాలా మంది సూర్తి చెంది న‌న్ను సంప్ర‌ది్చారు. నాతో క‌లిసి ప‌ని చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. నా మీద నమ్మకంతో వాళ్లు విరాళాలు ఇవ్వడంతో పాటు అనేక రకాలుగా సేవలో భాగస్వాములు అవుతున్నారని సోనూ చెప్పాడు. తన దగ్గరున్న డబ్బుకు ఈ విరాళాలు కూడా చేర్చి సోనూ సూద్ ఫౌండేషన్ ద్వారా ఈ మంచి పనులన్నీ చేయగలుగుతున్నానని వివరించాడు. లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లను ఆదుకునేందుకు భారీ ప్రణాళికలే రచించామని , రానున్న రోజుల‌లో 2 ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు ఇప్పించే ప్ర‌య‌త్నం చేస్తామంటున్నాడు సోనూసూద్.