అందరికి ఆశ్చర్యం కలిగిస్తున్న సోనూసూద్ ఆస్తులు. వెలుగులోకి కీలక విషయాలు

Advertisement

సోనూ సూద్ లాక్ డౌన్ విధించిన సమయంలో ఎంతో మంది వలస కార్మికులను తన సొంత ఖర్చుతో వారిని స్వస్థలాలకు పంపించాడు. తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో విలన్‌గా నటించి ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న సోనూసూద్ కరోనా కష్టకాలంలో రియల్ హీరో అనిపించుకున్నాడు.

అలాగే తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ కుటుంబానికి ట్రాక్టర్ కూడా కొనిచ్చాడు. ఇలా చాలా మందిని ఆదుకుంటున్నాడు సోనూ సూద్. అయితే తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ సోనూ సూద్ ఆస్తుల పై అధ్యయనం చేసారు. అయితే సోనూ సూద్ మొత్తం ఆస్తుల విలువ 130 కోట్లు అని తేలింది. దాంట్లో ఇప్పటికే పది కోట్లు ఖర్చుచేసాడని అంటున్నారు.

తాను సంపాదించిన డబ్బు అంత కూడా సినిమాల ద్వారానే సంపాదిస్తున్నాడని అన్నారు. అలాగే ముంబై నగరంలో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు అని, హోటళ్లు కూడా ఉన్నాయని తెలిపారు. ఇటీవల తన హొటల్‌ని వైద్యుల కోసం కేటాయించాడు అని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here