కోట్ల ఆస్థి తీసుకొని కన్నతల్లిని రోడ్డు పై వదిలేసిన కసాయి కొడుకులు

Advertisement

మనుషులు మానవత్వాని మరిచిపోతున్నారు. బంధాలు, బాంధవ్యాలు అన్నింటిని కూడా మరిచి రాక్షసుల్లా తయారవుతున్నారు. పైసల కోసం దగ్గరి సంబందాలను కూడా దూరం చేసుకుంటున్నారు. అయితే ఆస్తి కోసం అనారోగ్యంతో బాధపడుతున్న వృద్దురాలైన తల్లిని ఇంటి నుంచి గెంటి వేసిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. పిల్లలను పెంచి పోషించి పెద్ద చేసిన ఆ తల్లి చివరికి సొంత ఇల్లు లేకుండా రోడ్డు మీద దిక్కు తోచని స్థితిలో ఉంది.

వివరాల్లోకి వెళితే అంబర్‌పేట గోల్నాకలో దారుణమైన సంఘటన జరిగింది. పక్షవాతంతో బాధపడుతున్న కన్నతల్లి కమలమ్మ (77)ను ముగ్గురుకుమారులు నడి రోడ్డుపై వదిలేశారు. అయితే కొద్ది రోజుల క్రితం కమలమ్మ భర్త మృతి చెందాడు. అప్పటి నుండి కమలమ్మ కొడుకుల దగ్గర ఉంటుంది. ఆమె భర్త పేరు మీద ఉన్న ఆస్తులు అన్ని కూడా కొడుకులు వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు. ఆ తరువాత కమలమ్మ ను వదిలేశారు. దీనితో స్థానికులు ఈ విషయాన్నీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి మొత్తం తీసుకుని నడిరోడ్డు పై కన్నతల్లిని వదిలేయడం సరైన పద్దతి కాదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు వచ్చి కమలమ్మ కొడుకులను సర్దిచెప్పే ఆమె ను చూసుకోవాలని హెచ్చరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here