ఏఐసీసీ పదవికి రాజీనామా చేసిన సోనియా గాంధి

Advertisement

ఏఐసీసీ పదవి నుండి తాను తప్పుకుంటున్నట్లు సోనియా గాంధీ స్పష్టం చేసింది. అయితే ఈ రోజు ఉదయం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం అయ్యింది. ఇక ఈ సమావేశంలో తను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్ష పదవి తనకు ఆసక్తి లేదని ఈ సందర్భంగా సోనియాగాంధీ తెలిపింది. అలాగే పార్టీ సభ్యులందరికి కూడా కొత్త అధ్యక్షున్ని ఎన్నుకోవాలి అని సూచించింది.

ఇక సోనియా రాజీనామాను కేసీ వేణుగోపాల్‌ సమావేశంలో సభ్యులకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా సోనియా అధ్యక్ష పదవి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఇవ్వాలని‌ పేరును ప్రతిపాదించారు. కానీ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరియు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే అంటోని మళ్ళి సోనియానే కొన్ని రోజులు తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here