కాంగ్రెస్ అధ్యక్షురాలు కన్ఫర్మ్ అయ్యారు
Admin - August 25, 2020 / 08:24 AM IST

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ మరోసారి కొనసాగనున్నారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సీడబ్ల్యూసీ సమావేశం సుధీర్ఘంగా సాగింది. ఒకవైపు పార్టీ సీనియర్లు రాసిన లేఖపైనా చర్చలు జరిగాయి.
దాంట్లో భాగంగా సోనియా అధ్యక్ష పదవి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఇవ్వాలని పేరును ప్రతిపాదించారు. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరియు కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే అంటోని మళ్ళి సోనియా గాంధీనే కొన్ని రోజులు తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనితో మరోసారి సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనుంది.