Sonam Kapoor : వెనకనుంచి వచ్చి అక్కడ చేతులతో నొక్కాడు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్..!
NQ Staff - June 13, 2023 / 10:22 AM IST

Sonam Kapoor : సినిమా రంగంలోనే కాదు.. అమ్మాయిలకు ఎక్కడైనా సరే వేధింపులు అనేవి కామన్ అయిపోతున్నారు. ఇక సినిమా రంగలో అయితే కాస్టింగ్ కౌచ్ పేరుతో లొంగదీసుకునే నీచైమన కార్యక్రమాలు చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. అయితే ఇప్పుడు కాస్త మారుతున్నారు. అమ్మాయిలు, హీరోయిన్లు తమకు జరిగిన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా పెదవి విప్పింది. ఆమె సినిమాల్లో మొన్నటి వరకు బాగానే నటించింది. బాలీవుడ్ అగ్ర హీరోలతో నటించి మెప్పించిన ఈ భామ.. ఇప్పుడు పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. పిల్లలు పుట్టిన తర్వాత కూడా బాగానే సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నాకు 14 ఏండ్ల వయసు ఉన్నప్పుడు ఓ సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లాను. విరామ సమయంలో స్నాక్స్ కోసం బయటకు వెళ్లినప్పుడు అక్కడ ఓ వ్యక్తి వెనక నుంచి వచ్చాడు.
సడెన్ గా నా ఎద భాగాలపై చేతులు వేసి నొక్కాడు. ఆ సడెన్ సిచ్యువేషన్ తో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో గట్టిగా ఏడ్చేశాను. అమ్మాయిలు ఇలాంటి ఘటనలు ఎదుర్కునేందుకు సిద్దంగా ఉండాలి. ఏమైనా తేడా వస్తే బయటకు చెప్పేందుకు ధైర్యం చేయాలి అంటూ చెప్పింది ఈ భామ.