Sonal Chauhan: డైరెక్ట‌ర్‌కి స‌రెండ‌ర్ అయిపోయా.. ఆయ‌న చెప్పిన‌ట్టు చేస్తున్నానంటున్న బాల‌య్య బ్యూటీ

Sonal Chauhan అవ‌కాశాల కోసం కొంద‌రు అందాల ముద్దుగుమ్మ‌లు ఎంతో తాప‌త్ర‌య ప‌డుతున్నారు. ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్టు చేసుకుంటూ వెళుతున్నారు.తాజాగా సోనాల్ చౌహ‌న్ డైరెక్ట‌ర్‌కి స‌రెండ‌ర్ అయిపోయా అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సోనాల్‌.. బాల‌కృష్ణ‌తో చేసిన లెజెండ్‌, డిక్టేట‌ర్, రూల‌ర్ చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అందాల‌ను ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేసింది. తాజాగా ఈ అమ్మ‌డు వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహరీన్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ఎఫ్‌3లో న‌టించే అవకాశం ద‌క్కింది. ఈ సినిమా విష‌యంలో తాను డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడికి స‌రెండ‌ర్ అయ్యాన‌ని చెప్పింది.

ఎఫ్ 3 గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘ నేను ఎఫ్2 సినిమా చూశాను. చాలా బాగా న‌చ్చింది. అయితే ఎఫ్ 3లో భాగ‌మ‌వుతాన‌ని ఎప్పుడూ అనుకోలేదు. ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ఎఫ్3లో న‌టించాల‌ని న‌న్ను సంప్ర‌దించిన‌ప్పుడు నాకు చాలా ఆనంద‌మేసింది. అయితే ఇందులో నేను చాలా మంచి పాత్ర చేస్తున్నాన‌ని చెప్ప‌గ‌ల‌ను.

హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. ఫుల్ ప్లెజ్డ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో న‌టిస్తున్నాను. ఇది వ‌ర‌కు నేను చేసిన చిత్రాల్లో పాత్ర‌ల‌కు ఈ పాత్ర పూర్తి భిన్న‌మైన‌ది. అనీల్ రావిపూడితో పాత్ర ప‌రంగా ముందుగానే చ‌ర్చించాను. న‌టిగా ఆయ‌న‌కు పూర్తిగా స‌రెండ‌ర్ అయ్యాను. ఆయ‌న సల‌హాలు, సూచ‌న‌లు పాటిస్తున్నానంతే’’ అన్నారు.

మనలో చాలా మందికి ఉండే ఆరోగ్య సమస్యలకు యోగ చేడయమే మంచి మందు. నేను అవిడ్ యోగ చేస్తుంటాను. ఆ ఫొటోను నా సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తుంటాను. యోగ నా జీవితంలో ఓ భాగమైపోయింది’’ అని అసలు సీక్రెట్ చెప్పేసింది మరి. 2008లో జన్నత్ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సోనాల్‌కు అవ‌కాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో అవ‌కాశాలు అందుకోలేక‌పోయింది.