Chandrababu : దానికి కారణం చంద్రబాబే? అసలు రహస్యాన్ని బయటపెట్టిన సోము వీర్రాజు?

Chandrababu : చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు ఉన్న రాజకీయ పరిణతి… ఈ దేశంలో ఇంకెవ్వరికీ లేదని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన్ను అందరూ ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అని అంటుంటారు. దశాబ్దాల పాటు.. రాజకీయాల్లో ఉండి తలలు పండిన నాయకుడిగా ఎదిగారు చంద్రబాబు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ ప్రజల మద్దతు కూడగట్టుకొని ఏపీలో విజయకేతనం ఎగురవేశారు చంద్రబాబు. కానీ…. 2019 ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోలేక ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నారు.

somu veerraju shocking comments on chandrababu
somu veerraju shocking comments on chandrababu

అయితే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో… ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అనేక అక్రమాలు జరిగాయి.. అనే విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక హోదా వద్దని… ప్యాకేజీ ఇచ్చినా చాలు అని చంద్రబాబు కేంద్రంతో రాజీ కుదుర్చుకున్నారని… దాని వల్లనే కేంద్రం హోదాను వదిలేసి… ప్యాకేజీ అంటోందని అప్పట్లో, ఇప్పట్లో విపరీతంగా విమర్శలు వచ్చాయి.

ఆ విమర్శలను ప్రస్తుతం నిజం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. అవును… అసలు ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి అసలు కారణం చంద్రబాబేనంటూ వీర్రాజు స్పష్టం చేశారు.

అసలు బీజేపీ ఏపీకి ఎటువంటి అన్యాయం చేయలేదు. ఏపీ ప్రజలను మోసం చేయాలని బీజేపీ ఏనాడూ అనుకోలేదు. ఏపీ ప్రజలను మోసం చేసిందే చంద్రబాబు. కేవలం ఆయన వల్లనే ప్రత్యేక హోదా రాలేదు. హోదా వద్దు… ప్యాకేజీ ముద్దు అని అప్పుడు చంద్రబాబు అనడంతో… కేంద్రం కూడా ప్యాకేజీ ఇవ్వడానికే అంగీకరించింది. అప్పుడు దగ్గరుండి చంద్రబాబు ప్యాకేజీ తీసుకొని… ఇప్పుడు అధికారం లేనప్పుడు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది.. అంటూ చంద్రబాబుపై సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.

Advertisement