Somesh Kumar : బీహార్ కి సోమేశ్…?? బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో బ్యూరోక్రట్
Sravani Journalist - January 10, 2023 / 07:19 PM IST

Somesh Kumar : అనుకున్న కార్యం కోర్ట్ తీర్పు ద్వారా జరిగిపోతున్నట్లుంది అనుకుంటున్నారా సీఎస్ సోమేశ్ కుమార్. ఇంతకీ సోమేశ్ కుమార్ మనసులో ఏమనుకున్నారు ? కోర్ట్ తీర్పు సోమేశ్ కుమార్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి ?
రాష్ట్ర విభజనలో సోమేశ్ కుమార్ ఏపీ క్యాడర్ కింద నియమించబడ్డారు. క్యాట్ కు దరఖాస్తు చేసుకొని తెలంగాణలో కొనసాగుతున్నారు. సీనియర్ IAS లు ఉన్నప్పటికీ కీలకమైన సీఎస్ పోస్ట్ ని సోమేశ్ కుమార్ దక్కించుకున్నారు. హై కోర్ట్ తాజాగా కీలకమైన తీర్పు ఇవ్వడంతో బీహార్ కి వెళ్లిపోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు సంబంధించి బీహార్ వివరాలను చూసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
2023 ఎండింగ్ వరకు సీఎస్ గా ఉండి.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని సోమేశ్ కుమార్ భావించారు. అయితే తాజాగా కోర్ట్ తీర్పు ఇవ్వడంతో IAS పదవికి రాజీనామా చేయనున్నారని సమాచారం. ఇప్పటికిప్పుడు బీహార్ వెళ్లి పార్టీ వ్యవహారాలు చక్కదిద్ది సీఎం క్యాడెంట్ గా వెళితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారట.
సోమేశ్ కుమార్… ఏ హోదాలో ఉన్న ప్రభుత్వం ఆదాయం పెంచడంలో ఆయనకు ఆయనే సాటి. ఎక్సయిస్ ఆదాయం అమాంతం పెంచేశారు. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడంలో బెస్ట్ పర్సన్.
ఇలాంటి అధికారి ఎక్కడున్నా.. అక్కడున్న పాలకుడికి సంక్షేమ పథకాల అమలు చాలా ఈజీ అవుతుందనేది టాక్. వేతనాలు సకాలంలో ఇవ్వలేకపోతుందనే విమర్శలకు తోడుగా ఇలాంటి అధికారి వెళ్ళిపోతే తెలంగాణ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమని ఆర్థిక శాఖ విభాగం అధికారులు అంటున్నారు.
రాజకీయాలపై ఆసక్తి ఉన్న సోమేశ్ కుమార్… బీహార్ వెళ్లిపోవడం తథ్యమని తెలుస్తోంది.