లాక్ డౌన్ దిశగా కొనసాగుతున్న రాష్ట్రాలు

Advertisement

కరోనా వ్యాప్తి ఇప్పుడు మరలా తార స్థాయికి చేరుకుంటుంది. లాక్ డౌన్ వరకు కొంత అయినా కేసులు కంట్రోల్ లో ఉండడం జరిగింది. అయితే అన్లాక్ ప్రక్రియ తరువాత కరోనా కేసులు పదులు వందలు వేలుగా పెరిగి ఇప్పుడు లక్షల సంఖ్యలో నమోదు అయినా పరిస్థితి నెలకొంది. అలా ఇప్పుడు ప్రస్తుతం ఇండియా కరోనా కేసుల విషయంలో ప్రపంచంలోనే 3 వ స్థానానికి చేరుకుంది.

దానితో ఇప్పుడు భారత్ లోని చాలా రాష్ట్రాలు కూడా పెరుగుతున్న కేసులని దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రలో కరోనా కట్టడి చెయ్యడానికి లాక్ డౌన్ ప్రకటించాలన్న ఆలోచన వైపు అడుగులు వేస్తున్నారు. ఆలా ఇప్పటికే ఉత్తరప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్ వంటి రాష్ట్రాలు లాక్ డౌన్ ని అమలు చేసి కొనసాగిస్తున్నాయి. ఇక తాజాగా కర్ణాటక లో కూడా పూర్తి స్థాయి లాక్ డౌన్ ని అమలు చేసే ఆలోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం. అంతే కాకుండా ఈ నెల 23 వరకు బెంగుళూరు మరియు కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో కూడా లాక్ డౌన్ ప్రకటించనున్నాయి అక్కడి ప్రభుత్వాలు.

అయితే భారత్ లో తొలి కరోనా కేసు నమోదు అయిన ప్రాంతం కర్ణాటక లో ఆ తరువాత వైరస్ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కానీ మరల గత నెల రోజుల నుండి కరోనా కేసులు ఊహించిన స్థాయిలో పెరగడం తో అక్కడ వరుసగా పది రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించాలి అన్న నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు కర్ణాటక లో ప్రతి ఆదివారం పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేసుకుంటూ వస్తూ ఉంది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా అది మాత్రమే సరిపోదు పూర్తిగా పది రోజుల పాటు లాక్ డౌన్ ని ప్రకటించాలి అన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ రాష్ట్రాలతో పాటు బీహార్ కూడా లాక్ డౌన్ ని ప్రకటించాలి అన్న నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 16 నుండి 30 వరకు అంటే 14 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ని ప్రకటించాలి అన్న నిర్ణయం తెలిపింది బీహార్ ప్రభుత్వం. ఇక్కడ వైరస్ వ్యాపించే క్రమం లో మొదట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని కరోనా వ్యాప్తిని కట్టడి చేసినప్పటికీ ప్రస్తుతం మాత్రం అన్ని రాష్ట్రాలతో సమానంగా కేసులు మరియు మరణాలు సంభవిస్తుండడం తో ఇక్కడ లాక్ డౌన్ ని కూడా లాక్ డౌన్ ని ప్రకటించనున్నారు.

అయితే ఇలా పైన తెలిపిన రాష్ట్రాల వరకు లాక్ డౌన్ ని అమలు చేయడమే కాకుండా కఠినమైన నిబంధనలు కూడా ఆయా రాష్ట్రాల్లో పాటించే విధంగా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే అత్యవసరాల మేరకు తప్ప వేరే విషయాలలో ఎవరైనా ప్రజలు బయటికి వచ్చినట్లైత్తే తగిన విధంగా వారిపైన చర్యలు తీసుకొనేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక పెరుగుతున్న కేసుల దృష్ట్యా మరికొన్ని రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ని అమలు చెయ్యాలి. అన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థుతుల దృష్ట్యా పూర్తి స్థాయి లాక్ డౌన్ ఒక్కటే కరోనా ని కట్టడి చెయ్యడానికి ఉపయోగపడగలదు అంటూ కొంతమంది నిపుణులు మరియు వైద్యులు తెలుపుతున్నారు. మరి చూడాలి ఏ ఏ రాష్ట్రాలు మున్ముందు లాక్ డౌన్ ని అమలు చేస్తాయి అనేది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here