Covid19 : కోవిడ్ పుట్టుకకు సంబంధించిన కొత్త విషయాలు.. ఎక్కడ నుండి వచ్చిందంటే…!
NQ Staff - July 27, 2022 / 05:51 PM IST

Covid19 : కరోనా మహమ్మారి ప్రజలను ఎంత భయబ్రాంతులకి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వలన ఎందరో మృత్యువాత పడ్డారు. కొన్ని కుటుంబాలు రోడ్డున కూడా పడ్డాయి. ఇప్పటికీ ఈ మహమ్మారి ప్రజల జీవితాలతో ఆడుకుంటూనే ఉంది. కొన్ని చోట్ల ఈ వైరస్ ఎఫెక్ట్ చాలానే ఉంది. అయితే కోవిడ్19 పుట్టుకకు సంబంధించిన కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వుహాన్ పుట్టినిల్లా?
చైనాలోని వుహాన్‌లో ఉన్న సీఫుడ్ మార్కెట్ నుంచే వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించిన ఆధారాలను వాళ్లు ప్రజెంట్ చేశారు. ఆ ప్రాణాంతక వైరస్ వుహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌లో ఉన్న జంతువుల నుంచి మానవులకు సంక్రమించినట్లు రెండు స్టడీలు తేల్చాయి. వుహాన్ మార్కెట్ ప్రాంతంలో చాలా కేసులు తొలుత నమోదు అయినట్లు ఓ స్టడీలో స్పష్టం చేశారు.

Some New Things About Origin of Covid19
ఇక జన్యు సమాచారం ద్వారా వ్యాధి వ్యాప్తి గురించి రెండో స్టడీ ద్వారా తేల్చారు. 2019 నవంబర్ లేదా డిసెంబర్‌లో మనుషుల్లోకి రెండు వేరియంట్లు ప్రవేశించినట్లు ఆ అధ్యయనాలు సూచించాయి. సార్స్ సీవోవీ 2 వైరస్ 2019లో హునన్ మార్కెట్‌లో అమ్మిన జంతువుల్లో ఉన్నట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. జంతువుల నుంచి మనిషికి వైరస్ సోకిందని తేల్చారు. గ్లాస్‌గో యూనివర్సిటీలో పనిచేసే వైరాలజిస్ట్ ప్రొఫెసర్ డేవిడ్ రాబర్ట్‌సన్ ఓ రిపోర్ట్‌ను తయారు చేశారు.

Some New Things About Origin of Covid19
వైరస్ ల్యాబ్ నుంచి లీకైందన్న రికార్డులను ఇది సరిచేస్తుందని ఆయన అన్నారు. వుహాన్‌లో తొలుత ఆస్పత్రి పాలైన వారిలో 50 శాతం మంది మాత్రమే సీఫుడ్ మార్కెట్‌తో డైరెక్ట్ లింకు ఉన్నట్లు గుర్తించారు. వుహాన్‌లో నమోదు అయిన కేసులను మ్యాపింగ్ చేయడం ద్వారా కూడా కొన్ని స్పష్టమైన విషయాలు తెలిసాయని ఆరిజోనా యూనివర్సిటీలోని ఎకాలజీ, ఎవల్యూషనరీ బయాలజీ శాఖ ప్రొఫెసర్ మైఖేల్ వోరోబే తెలిపారు. సార్స్ సీవోవీ2 వైరస్‌ను మోసుకువెళ్లే జంతువుల్ని ఆ మార్కెట్‌లో అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.