Health Tips : ఈ అలవాట్లు మీకున్నాయా.. అయితే మీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది జాగ్రత్త..!

NQ Staff - January 25, 2024 / 01:34 PM IST

Health Tips : ఈ అలవాట్లు మీకున్నాయా.. అయితే మీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది జాగ్రత్త..!

Health Tips :

ప్రస్తుత కాలంలో ఐశ్వర్యం ఉన్న వాడు కాదు.. ఆరోగ్యంగా ఉన్న వాడే అదృష్టవంతుడు అని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే ఆరోగ్యానికి ఉన్న పవర్ అలాంటిది మరి. అందుకే చాలా మంది ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుంటారు. కానీ మెజార్టీ జనాలు మాత్రం బిజీ బిజీ లైఫ్ లో పడిపోయి ఇష్టం వచ్చినట్టు గడిపేస్తున్నారు. కొన్ని అలవాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని అలవాట్లు బ్రెయిన్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తాడని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వాటిని వెంటనే మానేయకపోతే చాలా ప్రమాదం అని చెబుతుఉన్నారు. ఇంతకీ అవి ఏ అలవాట్లు అనేది చూద్దాం.

తగినంత నిద్ర లేకపోవడం

ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే కావాలనే నిద్ర పోకుండా ఉండిపోతున్నారు. ఇలా రోజులో సరైన నిద్ర లేకపోతే మాత్రం కచ్చితంగా రకరకాల సమస్యలు వస్తాయి. మెదడు పనితీరు తగ్గిపోతుంది. దాంతో పాటు జ్ఞాపకశక్తి కూడా కోల్పోతారు. కాబట్టి రోజుకు కనీసం ఏడు గంటలు కచ్చితంగా నిద్రపోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఎక్కువసేపు కూర్చోవడం

ఈ రోజుల్లో కూర్చుని పని చేసే జాబులు ఎక్కువ అవుతున్నాయి. దాంతో వ్యాయామాలు చేయడానికి కూడా చాలా మందికి సమయం ఉండట్లేదు. రోజులో గంటల కొద్దీ కూర్చుని బతికేస్తున్నారు. అయితే ఇలా ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి ఏర్పడటానికి సంబంధించిన మెదడు ప్రాంతాలు సన్నబడుతాయి. కాబట్టి ఎక్కువసేపు కూర్చోకుండా అప్పుడప్పుడు లేస్తూ ఉండాలి. రోజులో వ్యాయామాలు కూడా ఎక్కువగా చేయాలి.

ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం..

ఇది స్మార్ట్ ఫోన్ యుగం. ఇప్పుడు అందరూ జాబుల పేరుతో ల్యాప్ ట్యాప్ లేదంటే టైమ్ పాస్ పేరుతో రోజంతా ఫోన్లు చూడటానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలా రోజులో గంటల కొద్దీ స్క్రీన్ ను చూస్తే సిర్కాడియన్ రిథమ్ సున్నితమైన సమతుల్యతను కోల్పోతుంది. దాంతో మన మానిసక స్థితి సరిగ్గా ఉండదు. చాలా రకాల మానసిక సమస్యలు, నిద్రలేని లాంటి సమస్యలు కూడా వస్తాయి. దాంతో మెదడు పనితీరు తగ్గిపోతుంది.

టిఫిన్ మానేయడం..

చాలా మంది ఈ రోజుల్లో బరువు తగ్గేందుకు లేనిపోని పనులు చేస్తుంటారు. ఎక్కువగా అల్పాహారాన్ని మానేస్తుంటారు. అదేనండి ఉదయం తినకుండా ఉండిపోతారు. ఇలా చేయడం వల్లమెదడుపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఉదయం పూట తినే తిండి మన బ్రెయిన్ కు కావాల్సినంత శక్తిని ఇస్తుంది. కాబట్టి ఇలా తినకుండా ఉంటే మెదడుపై ఒత్తిడి తీవ్రంగా పెరుగుతంది. కాబట్టిఉదయాన్నే అల్పాహారం తినాలి.

తగినంత నీరు..

మన బాడీకి ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది. దాని వల్ల మన బాడీ హైడ్రేటెడ్ గా ఉండటమే కాదు…. చర్మం యవ్వనంగా కూడా కనిపిస్తుంది. దాంతో పాటు బ్రెయిన్ చాలా చురుగ్గా పని చేస్తుంది. నీరు తాగకపోతే బ్రెయిన్ పనితీరులో మార్పులు కనిపిస్తాయి. తీవ్రమైన ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాబట్టి రోజులో వీలైనన్ని ఎక్కువ సార్లు నీరు తాగేందుకు ప్రయత్నించాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us