సోషల్ మీడియా ఫెవరేట్ యాంకర్ మళ్ళీ వచ్చేసాడు

Advertisement

ప్రస్తుత రోజుల్లో నెటిజన్లు సోషల్ మీడియాను ఇష్టారాజ్యంగా వాడుతున్నారు. అయితే ఎక్కువగా మిమ్స్ విపరీతంగా వాడుతూ తెగ టైం పాస్ చేస్తున్నారు నేటి యువత. అయితే ఈ మిమ్స్ లో అనేక రకాల ఫన్నీ వీడియోలు ఉంటాయి. ఇక దాంట్లో ఓ కోపధారి మనిషి అనే యాంకర్ కూడా ఒకరు. ‘ఎందుకు పుడుతారో తెలీదు మనుషులు, బేసిక్ సెన్స్ ఉండదు, వివేకంతో ఆలోచించండి, ఇక్కడ ఓ పేరాను పెట్టాను కదండి’ అంటూ తన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక ఇతన్ని మిమ్స్ లో కూడా విపరీతంగా వాడుతారు. ఇక ఇన్ని రోజులు ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉండేది.

అసలు ఈయన ఎవరు అని. ఇక ఆ సందేహం తీరినట్టే.. ఎందుకంటె ఈ కోపధారి మనిషి మళ్ళి రి ఎంట్రీ ఇచ్చాడు. ఇక వివరాల్లోకి వెళితే ఈయన పేరు కృష్ణ మోహన్. అయితే ఈయన ప్రస్తుతం ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ లో స్ట్రెయిట్ టాక్ విత్ జర్నలిస్ట్ అనే ఒక లైవ్ డెబిట్ ను నిర్వహిస్తున్నారు. ఇక ఇన్ని రోజులు ఎవరబ్బా అని సందేహం ఉన్న అందరికి ఆ సందేహం తీరిపోయింది. ఇక మన కోపధారి మనిషి కనిపించే సరికి అందరు తెగ నవ్వుతూ.. ఇన్ని రోజులు మాకు హాస్యాన్ని పండించినందుకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here