Rashmi Gautam : తప్పు చేశా.. క్షమించండి.. యాంకర్ రష్మీ ఎమోషనల్..!
NQ Staff - June 6, 2023 / 10:47 AM IST

Rashmi Gautam : యాంకర్ గా రష్మీకి చాలా మంచి ఇమేజ్ ఉంది. ఆమెపై ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు లేవు. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. ఇక జంతువులను ఇబ్బంది పెడుతున్న వీడియోలను పోస్టు చేసి ఫైర్ అవ్వడం రష్మీకి మొదటి నుంచి ఉన్న అలవాటే.
ఇదిలా ఉండగా రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఏడాది పూర్తయిపోయింది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానులు విషెస్ చెబుతున్నారు. రకరకాల వీడియోలను ఎడిట్ చేసి మరీ విషెస్ చెబుతున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీకి రష్మీ వచ్చిన మొదట్లో ఆమెపై చాలా విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. ఆమె సక్సెస్ అవుతుందో లేదో అంటూ చాలామంది కామెంట్లు చేశారు.
కానీ ఆమె సక్సెస్ ఫుల్ గానే ఈ షోను నడిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా రష్మీ కూడా తాను శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ పోస్టు పెట్టింది. మీరందరూ శ్రీదేవి డ్రామా కంపెనీ షోను ఎంతగానో ఆదరిస్తున్నారు. మీ అందరి ప్రేమ నన్ను ఇంత దూరం తీసుకు వచ్చింది.
ఈ ప్రయాణంలో ఏమైనా తెలిసి, తెలియని తప్పులు చేసి ఉంటే క్షమించండి అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది రష్మీ. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.