Sobhita Dhulipala : నాకు కాబోయే భర్త అతనే.. ఎవరేమన్నా పట్టించుకోను.. శోభిత క్లారిటీ..!
NQ Staff - June 22, 2023 / 10:12 AM IST

Sobhita Dhulipala : ఈ నడుమ శోభిత ధూలిపాళ్ల పేరు బాగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆమె నాగచైతన్యతో ఎఫైర్ నడుపుతోందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. నాగచైతన్య తాను కొత్తగా కట్టుకుంటున్న ఇంటికి పలుమార్లు శోభితను తీసుకెళ్లాడు. దాంతో వీరిద్దరి నడుమ ఎఫైర్ ఉందంటూ వార్తలు మొదలయ్యాయి.
వాటిపై శోభిత ధూలిపాళ్ల అప్పట్లో స్పందించింది. అలాంటివేమీ లేవని తెలిపింది. కానీ రూమర్లు ఆగలేదు. ఎందుకంటే ఆ నడుమ లండన్ లో చైతూ, శోభిత డేట్ కు వెళ్లిన పిక్స్ వైరల్ అయ్యాయి. అప్పటినుంచి ఇవే రూమర్లు బలంగా వినపడుతున్నాయి. అయితే వీటిపై మరోసారి స్పందించింది శోభిత.
తాజాగా ఆమె నటించిన ది నైట్ మేనేజర్-2 ప్రమోషన్స్ లో పాల్గొన్న శోభిత మాట్లాడుతూ.. ఎవరేం అన్నా సరే నేను పెద్దగా పట్టించుకోను. నాకు కాబోయే వాడు చాలా సింపుల్ గా ఉండాలి. జీవితం చాలా చిన్నది. ప్రతి నిముషం ఆస్వాదించాలని నేను అనుకుంటాను. అందుకే నాతో ప్రేమతో గడిపే వ్యక్తిని కోరుకుంటాను.
అంతే కాకుండా అతను ప్రకృతి ప్రేమికుడు అయి ఉండాలి అంటూ తెలిపింది శోభిత. అంతే కాకుండా చైతూతో డేటింగ్ రూమర్లపై కూడా స్పందించింది. అలాంటివి నేను పెద్దగా పట్టించుకోను అంటూ ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.