Acharya: జ‌న‌వ‌రి 29న అభిమానులకు పండుగే.. ఆ రోజు ఎన్ని స‌ర్‌ప్రైజ్‌లు ఉన్నాయో తెలుసా?

Acharya క‌రోనా వ‌ల‌న వినోదం లేక దాదాపు ఎనిమిది నెల‌లు విసిగిపోయిన ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదం పంచేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నారు. కాస్త గ్యాప్ కూడా ఇవ్వ‌కుండా స‌ర్‌ప్రైజ్‌లతో ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని వారు భావిస్తున్నారు. ఓ వైపు సినిమాలు విడుద‌ల మ‌రోవైపు ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌లు ఇంకో వైపు ట్రైల‌ర్స్, టీజ‌ర్స్‌తో సంద‌డి. ఇన్నింటి మ‌ధ్య సినీ ప్రేక్ష‌కుల ఆనందం అవ‌ధులు దాట‌డం ఖాయం.ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 29న సినీ ప్రేక్ష‌కులు వినోదంలో త‌డిసి ముద్ద‌వ్వ‌డం ప‌క్కాగా క‌నిపిస్తుంది. జ‌న‌వ‌రి 29 శుక్ర‌వారం రోజు యాంక‌ర్ ప్ర‌దీప్ న‌టించిన 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా అనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఎప్ప‌టి నుండో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందిస్తుంద‌ని అంటున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ఆచార్య టీజ‌ర్ కోసం ప్రేక్ష‌కులు క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. న్యూ ఇయ‌ర్ కు వ‌స్తుంద‌ని అనుకోగా అది జ‌ర‌గ‌లేదు. సంక్రాంతికి సంద‌డి చేయ‌లేదు. రిప‌బ్లిక్ డే రోజు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వ‌లేదు. దీంతో చిరునే డైరెక్ట్‌గా రంగంలోకి దిగి ఆచార్య టీజ‌ర్ అప్‌డేట్ ఇస్తావా, లేదంటే లీక్ చేయ‌మంటావా అని ప్ర‌శ్నించ‌డంతో జ‌న‌వ‌రి 29 సాయంత్రం 4.05ని.ల‌కు మూవీ టీజ‌ర్ విడుద‌ల కానున్న‌ట్టు తెలియ‌జేశారు. ఇక క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం స‌న్ ఆఫ్ ఇండియా.శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాల పై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైమండ్‌ రత్నబాబు దర్శకుడు.

దేశభక్తి ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రంలో దేశం కోసం ఓ వ్యక్తి ఎలాంటి పోరాటం సాగించాడన్నది ఆసక్తిని రేకెత్తించేలా చూపించ‌నున్నారు. తెలుగు తెర పై ఇప్పటివరకు ఎవరూ స్పృశించని కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ని జ‌న‌వరి 29 ఉద‌యం 10గం.లకు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించారు. ఇక ప్ర‌భాస్ హీరోగా దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్‌తో వ‌ర‌ల్డ్ స్థాయిలో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించ‌నున్న చిత్రాన్ని అశ్వినీద‌త్ నిర్మించ‌నున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్స్ జ‌న‌వ‌రి 29 మ‌రియు ఫిబ్ర‌వ‌రి 26 తేదీల‌లో రానున్నాయి అని నాగ్ అశ్విన్ కొద్ది రోజుల క్రితం తెలిపారు. మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమంటే ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ చిత్రం జ‌న‌వ‌రి 13న థియేటర్స్‌లోకి రాగా, ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 29న అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల చేయ‌నున్నారు.

Advertisement