Smart phones and laptops With half price : స్మార్మ్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లను సగం ధరకే కొనేయొచ్చు.. ఇలా చేస్తే సరిపోద్ది..!
NQ Staff - September 8, 2023 / 01:02 PM IST

Smart phones and laptops With half price : ఈ రోజుల్లో స్టూడెంట్లే కాదు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు వాడుతున్నారు. అయితే వీటిని కొనుగోలు చేయాలంటే వేల నుంచి లక్షల వరకు ఖర్చు చేయాల్సిందే. కొంచెం బ్రాండెడ్ వి కొనుక్కోవాలంటే తప్పనిసరిగా పెద్దగా ఖర్చు పెట్టాలి. కొన్ని కంపెనీలు అయితే వెయ్యి నుంచి రెండు వేల వరకు డిస్కౌంట్లు ఇస్తుంటాయి. ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తే ఆఫర్ల రూపంలో రూ.5వేల వరకు డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉంటాయి. పండుగల సమయంలో కొంటే ఇంకొంచెం ఎక్కువ ఆఫర్లు వస్తుంటాయి. ఇక పాతవి ఏమైనా ఉంటే ఎక్స్ చేంజ్ పెట్టుకుంటే సగం వరకు ఖర్చు తక్కువ అవుతుంది.
మరి ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ఎక్స్ చేంజ్ ఆఫర్లు లేకుండా నేరుగా సగం ధరకే ఎలా కొనుగోలు చేయాలి అని అందరికీ ఓ ప్రశ్న ఉంటుంది. దానికి సమాధానం మేం చెబుతాం. మీరు ఏదైనా షోరూంకు వెళ్లారనుకోండి అక్కడ డెమో పీస్ లను చూసి కొత్త ల్యాప్ ట్యాప్ లను కొనుక్కుంటారు. వాటికి షోరూం వాళ్లు చెప్పిన ధరను మీరు కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలామందికి ఓ విషయం తెలియదు. అదేంటంటే ఆ డెమోలో పెట్టిన పీస్ లను కొనుగోలు చేస్తే సగం ధరకే దక్కించుకోవచ్చు. ఆ బ్రాండ్ కు సంబంధించిన అన్ని ల్యాప్ ట్యాప్ లు అమ్ముడు పోయినప్పుడు ఆ డెమో పీస్ ను కూడా అమ్ముతారు షోరూం వాళ్లు.
అయితే ఆ డెమో పీస్ లను మాత్రం వారు సగం ధరకే అమ్ముతుంటారు. అన్ని పీసులు అయిపోయిన తర్వాత దాన్ని అమ్మకానకి పెడుతారు. అయితే ఇది సెకండ్ హ్యాండ్ కాదండోయ్. ఇది కూడా కొత్తదే. దీన్ని వచ్చిన కస్టమర్లు చూస్తారు. అంతే తప్ప దీన్ని వాడరు. నలుగురి చేతులు పడ్డాయని తప్ప అంతకు మించి ఎలాంటి డ్యామేజ్ జరగదు. కొత్త ల్యాప్ ట్యాప్ ల లాగానే దీనికి కూడా వారంటీ ఉంటుంది. సెలఫోన్లు కూడా అంతే.
డెమో పీస్ లు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు తక్కువ ధరకే అమ్ముతుంటారు. మరి డబ్బులు ఊరికే రావు కదా. సగం ధరకే వస్తువు కావాలని అనుకున్నప్పుడు ఇలా చేస్తే మంచిది. మీరు షోరూంకు వెళ్లినప్పుడు అక్కడ పని చేసే వారిని అడిగితే ఈ విషయం మీకు అర్థ మయ్యే విధంగా చెబుతారు.