చిన్న గొడవ , అపార్ట్మెంట్ పై నుండి దూకి తల్లి కూతుర్ల ఆత్మహత్య

Advertisement

నేటి తరంలో కొందరు చిన్న చిన్న గొడవలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనీసం తమ పై ఉన్న బాధ్యతలను మరిచి తప్పు దారిన పడుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లోని రామంతాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఒక మహిళా తన ఏడాది పాపతో అపార్టుమెంట్ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. అపార్టుమెంట్ నాలుగవ అంతస్థు నుండి దూకే సరికి ఆమెకు బలమైన గాయాలు తగిలాయి.

దీనితో తల్లి కూతుళ్లు ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఇద్దరి మృతి దేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మృతికి గల కారణం తన భర్తతో గొడవ పడి ఆవేశంతో పై నుండి దూకి ప్రాణాలు తీసుకుంది అని తెలిసింది. పోలీసులు ఈ ఘటన పై కేసు దర్యాప్తు చేసుకొని విచారణ చేస్తున్నారు. ఇక మృతురాలి కుటంబంలో విషాద ఛాయలు అములుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here