Sitara Ghattamaneni Fan Of Allu Arjun : అల్లు అర్జున్ కు సితార ఇంత పెద్ద అభిమానా.. బన్నీ కోసం ఏం చేసిందంటే..!
NQ Staff - July 24, 2023 / 11:22 AM IST

Sitara Ghattamaneni Fan Of Allu Arjun :
సినీ తారలకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వారి పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. అయితే అదే హీరోల అభిమానుల నడుమ అప్పుడప్పుడు వార్ కూడా జరుగుతుంది. టాలీవుడ్ లో మహేశ్, బన్నీ ఫ్యాన్స్ నడుమ ఎప్పటి నుంచో వార్ జరుగుతోంది.
ఈ ఇద్దరూ తరచూ తమ సినిమాలతో పోటీ పడుతూ ఉంటారు. ఒకసారి మహేశ్ పై చేయి సాధిస్తే.. మరోసారి బన్నీ గెలుస్తాడు. ఈ ఇద్దరూ ఎన్నడూ డైరెక్టుగా కలుసుకున్న ఘటనలు కూడా లేవు. ఈవెంట్లలో ఎదురైనా సరే పెద్దగా పలకరించుకోరు. కానీ ఇప్పుడు మహేశ్ బాబు కూతురు చేసిన పని అందరికీ షాక్ ఇచ్చింది.
ఆ మేనరిజాన్ని వాడుతూ..

Sitara Ghattamaneni Fan Of Allu Arjun
సితారకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేస్తుంది. తాజాగా ఆమె తండ్రి మహేశ్ తో ఫ్లైట్ లో దిగిన పిక్ ను షేర్ చేసింది. ఇందులో తండ్రి భుజం మీద చేయి వేసింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం తగ్గేదే లే ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

Sitara Ghattamaneni Fan Of Allu Arjun
ఇప్పుడు సితార కూడా బన్నీ మేనరిజాన్ని అనుకరించింది. సితార కూడా ఈ మ్యానరిజం ని వాడుతూ దిగిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇంకేముంది ఇది చూసిన వారంతా అల్లు అర్జున్ కు సితార ఇంత పెద్ద అభిమానా అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోను బన్నీ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.