Sitara Ghattamaneni And Allu Arha Are Using Fathers Star Status : అప్పుడే కోట్లు సంపాదిస్తున్న సితార, అర్హ.. స్టార్ హీరోల స్టేటస్ ఇలా కలిసొస్తోందా..!
NQ Staff - July 16, 2023 / 01:33 PM IST

Sitara Ghattamaneni And Allu Arha Are Using Fathers Star Status :
స్టార్ హీరోలకు ఉన్న స్టేటస్ అనేది ఆటోమేటిక్ గా వారి పిల్లలకు కూడా వర్తిస్తుంది. స్టార్ల పిల్లలు అంటే వారికి కూడా ఫాలోయింగ్ ఏర్పడుతుంది. తండ్రుల అభిమానులు ఆటోమేటిక్ గా వారిని కూడా ఆదరిస్తుంటారు. అందుకే హీరోల పిల్లలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి త్వరగానే పెద్ద స్టార్లు అవుతుంటారు.

Sitara Ghattamaneni And Allu Arha Are Using Fathers Star Status
అయితే ఇప్పుడు చిన్న వయసులోనే సితార, అర్హ కూడా తమ తండ్రుల స్టార్ స్టేటస్ ను వాడేసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు. మహేశ్ బాబు కూతురు సితార పీఎంజే జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తోంది. ఇప్పటికే ఈ యాడ్ చేసినందుకు కోటి తీసుకుందనే ప్రచారం జరుగుతోంది.
దేవర సినిమాలో..

Sitara Ghattamaneni And Allu Arha Are Using Fathers Star Status
అయితే ఇండియాలో ఓపెన్ చేసిన బ్రాంచ్ కు ఆమె ముఖ్య అతిథిగా వెళ్లారు. ఇలా ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి రూ.3 కోట్లు తీసుకుంటుందంట. ఇది స్టార్ హీరోయిన్ల రేంజ్ అని అంటున్నారు. ఇక అటు అల్లు అర్హ కూడా వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే శాకుంతలం సినిమాలో పాత్ర చేసిన ఆమె ఇప్పుడు దేవర సినిమాలో నటిస్తోందంట.
ఈ సినిమాలో పాత్ర కోసం ఏకంగా రూ.20 లక్షలు తీసుకుంటుందంట. ఇలా చిన్న వయసులోనే తండ్రుల స్టేటస్ వల్ల లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. తండ్రులకు స్టార్ స్టేటస్ ఉంటే ఆటోమేటిక్ గా వారి పిల్లలకు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది దొరుకుతుందని వీరిని చూస్తేనే అర్థం అవుతోంది.