సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం భార్యకు కరోనా

Advertisement

సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా సోకిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి తరలించారు వైద్యులు. దీనితో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఎంజీఎం వైద్యులు తన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

దీనితో బాలు అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఒకవైపు నాన్న ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, ఆయన కోలుకుంటున్నారని బాలు కుమారుడు చరణ్ ప్రకటించాడు. దీనితో అందరు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలా ఉంటె తాజాగా తన కుటుంబంలో మరొకరు కరోనా బారిన పడ్డారు. ఆయన భార్య సావిత్రి కూడా కరోనా వైరస్ బారిన పడిందని వార్తలు వస్తున్నాయి. దీనితో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here